Monday, February 18, 2013

భారత దర్శనము

 జవహర్ లాల్ నెహ్రు రచన 
భారత దర్శనము
The Discovery of India కి తెలుగు అనువాద గ్రంధం.




             నేనీ పుస్తకాన్ని అహ్మమద్ నగర్ కోటలో ఉండగా 1944 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అయిదు నెలల్లో వ్రాసాను. నాతో పాటు ఖైదులో ఉన్న సహచరులలో కొందరు సహృదయత తో దీని వ్రాతప్రతిని చదివి, అనేక అమూల్య సుచానలిచ్చారు. దేనిని ఖైడులోనే సరి చేసేటప్పుడు ఆ సూచనల నుపయోగించికుని. కొన్ని చేర్పులు కూర్చాను. అయితే, నా ఈ రచనలోని భావాలకు ఏ ఒక్కరు భాధ్యులు కారని , లేక వా రామోదిస్తారని బావించ నవసరం లేదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను. కానీ, వారితో కలసి, అనేక సమాలొచనలూ, చర్చలూ జరపడంవల్ల భారతీయ చరిత్ర, సంస్కృతుల వివిధ దృక్పధాలను గురించి నా మనసులో మసకగా ఉన్న భావాలూ విశిష్ట  రూపం దాల్చాయి.అందుకు వారికీ నా హృదయ పూర్వక కృతజ్ఞత తెలుపుకొకతప్పదు.  

              అహ్మమద్ నగర్ కోటలో నా సహచరులుగా ఉన్న పదకొండు మంది బారత దెస వైవిధ్యాన్ని ప్రదర్శించే ముచ్చటయిన వ్యక్తులు. వారనేక విధాలుగా భారత రాజకేయలకే గాక , అధునాతన పాండిత్యా లకు , వర్తమాన  భారతదేశ వివిధ ద్రుక్పధాలకు ప్రతినిధులు. భారత దేశ ప్రధాన సజీవ భాషల్లో దాదాపు అన్నిటికి భారత దేశాన్ని గతంలోనూ వర్తమానంలో కూడా గాడంగా ప్రభావితం చేసిన పరచెన భాషలకు ప్రాతినిధ్యం లభించింది. 

నేను కొన్నాళ్ళ క్రితం వ్రాసినదాన్ని, కొంతకాలానికి మల్లి చదువుతూవుంటే, ఒకవిధమైన విచిత్రనుభూతి ఇబ్బడిముబ్బడి గా ఉంటుంది. నాకు సంహితుడైన బిన్నమైన మరో వ్యక్తి రచించిన గ్రంధాన్ని చదువుతున్నట్లు తోస్తుంది. ఇది బహుశా, నాలో జరిగిన మార్పు ఒక్క పరిమాణం కావచ్చు.
                                                                                                            ...............   జవహర్ లాల్ నెహ్రు                                                                      

 
గొప్ప ప్రజాస్వామ్యవాది అయిన నెహ్రు ఆంగ్లం లో అనేక గ్రంధాలను రచించారు. తను రాసిన 'స్వీయచరిత్ర' కు కొనసాగింపుగా మరో రచనకు సంసిద్ధమైనారు . తనకు మహా ప్రేతిపాత్రమైన -- తను ప్రగాడంగా ప్రేమించే భారత మాతను గురించి రాస్తే బాగుంటుందని ' ది డిస్కవరీ అఫ్ ఇండియా " గ్రంధ రచనకు పూనుకున్నారు. ఈ గ్రంధ రచనలో అబ్దుల్ కలాం ఆజాద్,గోవింద వల్లబ్ పంత్ వంటి స్వాతంత్ర సమరయోధులు తమ తోడ్పాటు అందించారు. ఈ పుస్తకం తెలుగులో 'భారత దర్శనం ' అన్న పేరుతో వెలువడింది. వీరి రచనలలో "సోవియట్ రష్యా", గిమ్ప్లేస్ అఫ్ వరల్డ్ హిస్టరీ" " ది డిస్కవరీ అఫ్  ఇండియా " అన్నవి ప్రసిద్ధ రచనలు.

బుక్  కోసం


పేజిలు : 625

ధర : రూ 400/-


లబించు చోటు 

తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

No comments:

Post a Comment