Thursday, February 28, 2013

కరుణ శ్రీ బాల సాహిత్యం

తెనుగుదనము వంటి తీయధనము లేదు ;
తెనుగు కవుల వంటి ఘనులు లేరు ;
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలిత సుగుణజాల ! తెలుగు బాల !



"తెలుగు బాల " తెలుగు  బాల లందరికి ముద్దుల చెల్లాయి . చెల్లాయిని చేతుల్లోకి తీసుకుని లాలిస్తే మీకు మంచి మాటలు చెబుతుంది . సూక్తులు వినిపిస్తుంది . నీతులు భోదిస్తుంది . పెద్ద పెద్ద పుస్తకాలలోని బావాలన్ని చిన్న చిన్న పద్యాల్లో మీకు స్పష్టం చేస్తుంది . అందమైన పద్యాలు పాడి మీ అందరికి ఆనందాన్ని అందిస్తుంది . ..కరుణ శ్రీ


తెలుగు బాల ! నీ పంట పండింది . నిజంగా అదృష్టమంటే నీదే . పెద్దపెద్ద వాళ్ళకు అర్ధమయ్యేలా పెద్దపెద్ద పుస్తకాలు వ్రాసిన శ్రీ శాస్త్రి గారు బంతిలో బాలపక్షం లేకుండా నీకోసంగూడ కలంబట్టి , నీ తాహతుకు తగినట్టుగా ముద్దులొలికే చిన్న చిన్న పద్యాలూ వ్రాసి , నేకు బహుమానం గా ఇచ్చారు.

             శాస్త్రి గారి పూర్తి పేరేమిటో తెలుసా! శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు . వీరు చాలారోజుల నుంచి మీ పెద్దవాలందరికీ పరిచయమైనవారే . మీ పెద్దవాల్లందరికి వీరి పద్యాలు ఎంత యిష్టమనుకున్నావ్ ! అయిన మీ అన్నయ్య నో , నాన్ననో , అమ్మనో అడిగి చూడు . నా మాట అభద్దమేమో తేలుతుంది .
       
              మరే, ఇంకో చిన్న రహస్యముంది , అసలు పేరు పాపయ్య శాస్త్రి గారా , అదిగాక ఇంకో పేరు కూడా ఉంది వీరికి. ఆ పేరు వారు వ్రాసిన పుస్తకాలపైన కనపడుతుంది . ఆ పేరంటే వారికెంత యిష్టమనుకున్నావ్ ! తొందర పడబోకు చేబుతామారి ; ఆ పేరే "కరుణశ్రీ"

             "లలిత సుగుణజాల ! తెలుగుబాల ! " అంటూ ఆప్యాయంగా పిలుస్తూ , మీకిష్టమయ్యే మాటల్లో తేలిగ్గా , ఉండేటట్లు , బెదిరిపోకుండా , ముద్దు ముద్దుగా కొన్ని నీతులు , కొన్ని రహస్యాలు , కొన్ని అనుభవాలు చెప్పారు. వాటినన్నిటినీ శ్రద్ధ తో , ప్రేమతో చదివి అర్ధం చేసుకొని మరి వారు చెప్పినట్లు నడుచుకుంటారు గదూ !

                                                                                                          -----------  "ధనకుధరం "

కరుణ శ్రీ గారు వ్రాసిన ఈ పుస్తకం లో తీయటి పద్యాలతో పాటు మంచి మంచి  కధలు , చిన్న చిన్న నవలలు ఎన్నెనో ఉన్నాయి.
ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 454
ధర : రూ 275/-


తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates



Wednesday, February 27, 2013

పుస్తక పరిచయం - స్పూర్తి పాటలు

స్పూర్తి పాటలు 

' జిలుగు వెలుగుల చేరనేసినా
జీవగంజే కరువురా
పసిడి కాంతుల వెన్నలద్ధినా
పుట గడవని బతుకురా '
నూలునంతా తీసుకొచ్చి - అందమైన రంగులద్ది
ఏడు పోట్టెలు కలిపినావు - చిట్టెలాగా చుట్టినావు
పొద్దునుండి రాత్రి వరకు  - రాట్నమెంత తిప్పుతున్నా
కండె చుట్టూ దార మాయే - కంటి నుండి దార లాయె
రబ్బర్లు చుట్టి రంగులేసి - పంటే మీద చిటికె తెచ్చి
కన్నబిడ్డకు తెల్లివోలె - చిక్కు లేసి దారమంత
తీరు తీరున బొమ్మలన్నీ - అందంగా ఆసు పోసినా
చీరలన్ని మెరిసి పోయె - నేసినోల్లె ఎలిసిపోయే '

అంటూ ప్రతి పాట  సగటు మానవుడి జీవితం లో భాదని  కళ్ళకు కట్టి నట్లు చూపి గుండెల్లో చెరగని ముద్ర వేస్తుంది.



ఎక్కడ సమస్య ఉంటె ఎక్కడ పోరాటముంటే అక్కడ స్పూర్తి ఉన్నదౌ. ఒక సుదీర్గ పోరాట క్రమం లో అతను భాగస్వామ్యం . స్పూర్తి పాటలు మన గుండెల్లో ఒదిగి పోతాయి.                       ....... శివా రెడ్డి


ఈ పాటలన్నీ ఏదో ఒక మహా సభకు తరలి వెళ్ళుతున్న కార్యకర్తల్లా కనిపించాయి. ఎవరికీ వారు సభా ప్రాంగణానికి త్వరగా చేరుకునేందుకు ప్రయత్నించి గబ  గబా ముందుకు సాగుతునట్లు సాగిపోయాయి. దేనినో తుదముట్టించడానికి లేదా శత్రువును అంతం చేయడానికి సకల దిక్కులా నుంచి ముట్టడిస్తున్న మనషుల్లా ఈ పాటలు కనిపించాయి . ఈ సంపుటి మొత్తం చదివాకా నా కళ్ళ ముందు ఒక 'ఒక ఎర్ర నారు మది ' కనిపించిది.
                                                                                                              .......... సీతారాం

స్పూర్తి రాసిన ప్రతీ పాటా ప్రజావ్యతిరేక విధానాలపై ఒక తూట. బ్రతుకులకు భద్రత లేకుండా చేస్తున్న వ్యవస్థ పై నిప్పుల వర్షం కురిపిస్తాయి. సమాజాన్ని మార్చాల్సిన అవసరాన్ని గుండెను తట్టి చెప్తాయి.....  వోరప్రసాద్ 




ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 366

ధర : రూ 200/-


తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

Tuesday, February 26, 2013

ముద్ర


మూడు భారతీయ భాషలలో సంచలనం సృష్టిoచిన తెలుగు నవల


కోటమ్మ దళిత యువతి . తమకు లొంగ లేదన్న కసితో ఆ ఊర్లోని సర్పంచ్ ముసలయ్య , ఆ ఊర్లో పూజారి శాస్త్రి తో కుట్రపన్ని ఆమెను బసివినిగా మార్చడం అనే ఈ నవలలో ప్రధాన సంఘటన మన హృదయాలను ద్రవింప జేస్తుంది . నవల ప్రారంభంలో హసీనాగా పరిచయమైనా స్త్రీయే కోటమ్మ అని తెలిసినప్పుడు మనం చాలా అశ్శర్య పడతాం . తన జీవితం ఎలాగు నాశనమైంది . తను ఎప్పుడో వడలిపోయి , తిరిగివచ్చి తన కూతురి జీవితాన్నైనా బాగు చెయ్యాలన్న పట్టుదలతో ఆమె సమాజంతో చేసిన పోరాటం ఆమె తెచ్చిన నిశభ్ధ విప్లవం ఎందరో దళితవర్గాలకు చెందినా స్త్రీలకు స్పురి దాయకంగా నిలుస్తుంది.  
నిమ్న వర్గాలకు చెందిన యువతులను అగ్రవర్ణాలవారు తమ లైంగిక సుఖం కోసం బసివినులుగా మార్చే దుష్ట , దుర్మార్గ సంప్రదాయాన్ని చిత్రిస్తూ వి. అర్. రాసాని ఈ నవలను రచించాడు . రాయలసీమ ప్రాంతంలో బసివిని వ్యవస్తకు వ్యతిరేకంగా పోరాడిన స్త్రీల జీవితాలను రాయలసీమ ప్రాంత పలుకుబళ్ళతో ఎంతో సహజంగా పాటకుల హృదయాలను ద్రవించేలా చిత్రించిన రాసానిని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను . 
                                                                                                         ...... అంపశయ్య నవీన్

ఈ నవలలిక చతురలో వచ్చింది, మంచి పేరొచ్చింది . కన్నడంలోకి వెళ్లి, అప్పుడే రెండు కాపులు కాసింది . 'ముద్ర'ఇప్పటికే జనామోదం పొంది, తనని తను నిరూపించుకుంది . కన్నడ,హిందీ,తమిళ బాష  లొకిఅనువాదమై ముద్రపడింది . ఇక సంతృపతకరమైన ముగింపునిచ్చింది. ముద్ర నవలని నడిపించిన తీరు అర్ధవంతంగా, ఆసక్తికరంగా సాగింది .               ................................ శ్రీ రమణ

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 192

ధర : రూ 120/-


తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

Monday, February 25, 2013

సింహావలోకనం


సింహావలోకనం


భారత స్వాతంత్రం కోసం గుండె నెత్తురులు తర్పణ చేస్తూ ముందుకు సాగిన సాయుధ పోరాట గాధ

ఈనాటి యువతరానికి తెలియని అనేక అత్యద్బుత సాహస కృత్యాల తోను, రహస్యలతోను, నిండి ఉన్న ఈ గ్రంధం నేటి యువతరాన్ని ఎంతగానో ఉత్తేజ పరచగలదు.

           ఈ పుస్తకంలో ఆనాటి సామజిక పరిస్థితులూ , కాంగ్రెస్ పార్టీ గాంధీ నాయకత్వంలో అనుసరించిన దళారీ రాజకీయ విధానం , ప్రజల మనోభావాలు, విప్లవ సంఘ కర్యకలాపాలూ చాలా బాధ్యతాయుతంగా పాటకుడిని విసుగెత్తించకుండా యశ్ పాల్ ఒక నవలలాగా , ఆత్మ కధలాగా రాశారు.

           కంపూటర్లు, టీవీలు, ఇతర వైజ్ఞానిక ప్రగతి - దోపిడీ స్వార్ధపర తత్వాల అధీనంలో వెర్రితలలు వేస్తూ సాధారణ ప్రజల్నే కాక మేధావుల్ని సహితం విభ్రమిప చేస్తున్న ప్రస్తుత స్థితి లో - నాటి విప్లవ వీర యోధులైన భగత్ సింగ్ , సుఖదేవ్, రాజగురు, చంద్ర శేఖర్ ఆజాద్, సలేగ్రాం శుక్లా మెదలుగా గలవారు దేశం కోసం , ప్రజల కోసం జాతి కోసం చేసిన త్యాగాలను, చూపిన సాహసాలను వినమ్రంగా మననం చేసుకోవడం - జాతి జీవన నాడి ని విప్లవోన్ముఖంగా ప్రభావితం చేయగలదు .



ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 454

ధర : రూ 275/-


తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates


Saturday, February 23, 2013

ఇన్ కమ్ టాక్స్ గైడ్


ఇన్ కమ్ టాక్స్ గైడ్


ఇన్ కమ్ టాక్స్ అంటే ఏమిటి ?
దానిని ఆదా చేసే మార్గాలను తెలియ చెప్పే పుస్తకం

ఇన్ కమ్ టాక్స్ ఈ మాట వినగానే చాలా మంది మదిలో ఆందోళన సహజంగానే ఏర్పాటు అవుతుంది . ఎందుకంటే అదో అర్ధం కాని సబ్జెక్టు అనే ఉదేశ్యం తో కనీసం దాని గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయని వారు చాలా మంది ఉన్నారు . ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు కూడా మీ ఆదాయపు ఏ విదంగా లెక్కిస్తున్నారు ? ఆదాయపు పన్ను ఆదా చేయడానికి ఎలాంటి మార్గాలు అనుసరిస్తున్నారు అని అడిగితే సరియైన సమాధానం రాదు . అంతే కాకుండా వారి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడతారు . ఈ విధంగా ఆదాయపు పన్ను లెక్కించడం మరియు ఆదాయపు పన్ను ఆదా  చేయడానికి అవకాశం కల్పిస్తున్న వివిధ సెక్షన్స్ గురించి తెలియకపోవడం వలన ఇతరుల మీద ఆధారపడటం తో చాల మంది ఆదాయపు పన్ను రూపం లో నష్టపోతున్నారు . అంతే కాకుండా షేర్ మార్కెట్లో ట్రేడింగ్ జరిపే సమయంలో సంభవించే నష్టాన్ని యే విధంగా ఆదాయపు పన్ను ఆదా చేయడానికి ఉపయోగించవచ్చో తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు . ఈ పుస్తకంలో ఆదాయపు పన్ను ఆదా  చేయడానికి అవకాశం కల్పిస్తున్న వివిధ సెక్షన్ లు మరియు ఆదాయపు పన్ను రిటర్న్ ఏ విదంగా నింపాలో సులభంగా ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే రీతిలో వివరించడం జరిగినది .




ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 232

ధర : రూ 100/-


తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

Friday, February 22, 2013

గణిత విజ్ఞాన సర్వస్వం


గణిత విజ్ఞాన సర్వస్వం


గణిత శాస్త్రానికి పుట్టినిల్లు మన భారత దేశం . అయితే గణితం పేరు వినగానే విద్యార్థుల గుండెల్లో దడ ప్రారంభమవుతుంది . కారణం గణితం పై సరిఅయిన అవగాహన విద్యార్థులకు లేకపోవడమే .

నిత్య జీవితానికి విలువనిచ్చేది , తెలివి తేటలను పెంచేది ఒక్క గణితమే నన్నదీ జగమెరిగిన సత్యం . ఈ శాస్త్రాల విలువలు పెంచేది కూడా గణితం . అందుకే Mathematics is the mother of science అంటారు . అటువంటి గణిత శాస్త్రాన్ని  6 నుంచి 10 తరగతులకు భోధించు ఉపాధ్యాయుడు విద్యార్ధికి ఎన్నో సులువైన మెలుకువలు అందించాల్సి ఉంటుంది . దానితో పటు సబ్జెక్ట్ పట్ల విద్యార్థులకు మక్కువ కలిగేటట్లు చేయాలి . కొద్దిపాటి క్రమశిక్షనాయుతమైన కృషి తో విద్యార్ధి ఉన్నట్లయితే ఆ విద్యార్ధి సబ్జెక్టు లో ప్రావీణ్యత సంపాదించడం తధ్యం .


6 నుంచి 10 తరగతులకు గణిత సామాగ్రిని పెంపొందించే భాగంగా ఈ పుస్తకం రాయబడినది . అంతేగాక ఎ.పి . అర్ . జె . సి , పాలిటెక్నిక్ ,టి టి సి , బి ఎడ్ , ఆర్ ఆర్ బి , బి ఎస్ అర్ బి , ఐ సెట్  తదితర పోటి పరిక్షలకు ఉపయోగపడే గణిత విజ్ఞాన గ్రంధం .




ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 270

ధర : రూ 125/-


లబించు చోటు 

తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com

మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

Thursday, February 21, 2013

వ్యక్తిత్వ వికాస కధలు

వ్యక్తిత్వ వికాస కధలు 
                               జి . వి . సుబ్రహ్మణ్యం 

ప్రాప్తాన్ని నమ్ముకు కూర్చుంటే .. 
నీవు వట్టిమనిషి వి . నిన్ను నువ్వు అవిష్కరించుకుంటే అణు శక్తివి 

నాయకుడు తన అనుచరులని లక్ష్యం దిశగా నడిపించాలి ఆతని మాటలు మెదడుని కాక మనుసుని తాకాలి హృదయపు తలపులని తెరిచే తాళం చెవి ' కధ'

ప్రపంచీకరణ నేపధ్యంలో వ్యక్తులకి, సంస్థలకి తమ ప్రతిభను నిరుపించుకోక థప్పదు. అందువల్ల అన్ని రకాల నైపుణ్యాలను వాళ్ళు పెంచుకొవలి. వారి విజయాలకు స్పుర్తినిచ్చేవి పుస్తకాలే . అవి పాశ్చాత్య దేశాల పుస్తకాలే కానక్కరలేదు .  
మన పంచతంత్ర కధలు చాలు . మూర్ఖులైన రాజకుమారులను కేవలం ఆరు నెలల్లో రాజనీతజ్నులని చేసిన గ్రంధం "పంచతంత్రం"
ఈ కధలలో వచ్చే సింహం , పావురం , కాకి , ఎలుక , తాబేలు ... స్వీయ నాయకత్వానికి , పరస్పర స్నేహానికి, ధైర్యంతో , పట్టుదలతో ఆపదలు అధిగమించడానికి ప్రతీకలు . 




ఈ  పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 151

ధర : రూ 90/-


లబించు చోటు 

తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com

మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates



80 ఏళ్ళ తెలుగు సినిమా

80 ఏళ్ళ తెలుగు సినిమా
ప్రస్థానం 1931-2011

పూర్తి రంగుల పేజీలతో

తెలుగు సినీ రంగం పై పరిశోధనాత్మక రచనలు విశ్లేషణలు అత్యంత అరుదు... ఆ లోటును పూరిస్తూ 7 ఏళ్ళ నిరంతర శ్రమ తో తెలుగు సినీ ప్రపంచానికి ఆత్మీయంగా అందిస్తున్న కానుక

భారతీయ సినీ వినీలాకాశంలో 80 ఏళ్ళ కాలంలో రెండవ అతి పెద్ద పరిశ్రమగా అవతరించిన తెలుగు సినిమా రంగం పురోగతి, గమనం , సాధించిన రికార్డు లు , ప్రశంసలు , అవార్డ్ లు వంటి ఎన్నో ఉప యుక్తమైన అంశాలపై సంవత్సరాల వారిగా ఒకే చోట అందించిన సాధికారిక రివార్డ్ - ఈ ప్రస్థానం .


ఇందులో టాప్ 80 సినిమాలు , టాప్ 80 గీతాలు
సంవత్సరాలవారిగా రిలీజ్ అయిన సినిమా లు వాటి విశేషాలు
హిందీ సినిమా మొత్తం గురించి సంక్షిప సమాచారం కూడా పొందుపరచడం జరిగింది .



పేజిలు : 334
ధర : రూ 900/-
(ధర కాస్త ఎక్కవే 
పూర్తి కలర్ పేపర్  దృష్ట్యా పెట్టి ఉండవచ్చు )


లబించు చోటు 

తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com 
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

Wednesday, February 20, 2013

పరాజయం విజయానికి సోపానం


పరాజయం విజయానికి సోపానం


A Setback is a Setup for a Comeback by Willie Jolley కి తెలుగు అనువాదం .

" ఈ పుస్తకం చదివి జీవితం మీకు విసిరే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి . ఉత్తేజపరిచే పుస్తకం " -                                
                                                                                                                                     ఆయన్ లా వాన్జేoట్



మీకెప్పుడైన పరాజయం సంభవించిందా ?
జీవితం మోసగించిందా ?
గడ్డు కాలాలు కృంగదీశాయా ?
మీ పరాజయాలను అపూర్వమైన విజయాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం, ఈ జీవితాన్ని మార్చడానికి ఒక నిమిషం చాలు , రాసిన విలీ జాలీ , పరాజయo విజయానికి సోపానం , అనే ఈ పుస్తకం లో మీరు కృషి చెయ్యడానికి, మీ లక్ష్యం సాధించుకోవడానికి స్పూర్తి నిస్తాడు. వి. డి . ఏ . డి ఫార్ములా - ముందు చూపు, నిర్ణయం, చర్య, కోరిక - జీవితంలో నిరంతరం ఎదురయ్యే సమస్యలను ఆదిగమించడానికి ఎలా తోడ్పడుతుందో చూపిస్తుంది . మీ అదృష్టం పగ్గాలు మీ చేతుల్లోనే ఉంచుకోవడానికి సాయపడే తన టెక్నిక్ లను మీతో పంచుకుంటాడు . కష్టాల ముందు తలవంచని, అనుకోని ప్రదేశాలలో అవకాశాలు అన్వేసించిన సాధారణ వ్యక్తుల అనుభవాల గురించి చెబుతాడు  . మనోరంజనమైన ప్రసంగాలు, ఉదాహరణలు, కధలతో మీరు మీ శక్తులను కేంద్రీకరించి, కార్మోన్ముఖులు అయేలా చేస్తుంది . విలీ ప్రతిపాదించిన పన్నెండు సరళమైన వ్యూహాలను ఉపయోగించి, మీరు మీ పరాజయాలను విజయాలుగా, సమస్యలను సంభ్యావ్యతలుగా మార్చుకొగలరు. ఇది నిజంగా ఒక ' ప్రేరనాత్మకమైన ఉత్తమ రచన '.


విలీ జాలీ, ' ఈ సంవత్సరంలోని ఒక విశిష్ట స్పూర్థిదాయక వక్త '

:నీ జీవితం లో నువ్వు ఎప్పుడైనా క్రింది స్థాయిలో ఉన్నప్పుడు, పైకి ఎలా వెళ్ళాలో , ఎలా బయటపడాలో, ముందు ఎటువంటి మార్గం ఉందో, ఈ పుస్తకం చూపిస్తుంది .  తప్పక చదవవలసిన గొప్ప పుస్తకo . "
                    - లెస్ బ్రౌన్, లివ్ యువర్ డ్రీమ్స్ రచయత


పరాజయం విజయానికి సోపానం పుస్తకం చదవడం, మీ సమస్యలను సంభావ్యతలుగా మార్చుకోవడంలో, మీ సవాళ్ళను అధ్బుత అవకాశాలుగా మలుచుకోవడంలో సహాయపడు తుందని నేను నమ్ముతున్నాను . "
                   - వాలి ఫేమస్ ఎమస్  , వాటర్ మెలన్  మ్యూజిక్ రచయిత.




ఈ రచయత పుస్తకo  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 203

ధర : రూ 150/-


లబించు చోటు 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన,మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates




 

Monday, February 18, 2013

భారత దర్శనము

 జవహర్ లాల్ నెహ్రు రచన 
భారత దర్శనము
The Discovery of India కి తెలుగు అనువాద గ్రంధం.




             నేనీ పుస్తకాన్ని అహ్మమద్ నగర్ కోటలో ఉండగా 1944 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అయిదు నెలల్లో వ్రాసాను. నాతో పాటు ఖైదులో ఉన్న సహచరులలో కొందరు సహృదయత తో దీని వ్రాతప్రతిని చదివి, అనేక అమూల్య సుచానలిచ్చారు. దేనిని ఖైడులోనే సరి చేసేటప్పుడు ఆ సూచనల నుపయోగించికుని. కొన్ని చేర్పులు కూర్చాను. అయితే, నా ఈ రచనలోని భావాలకు ఏ ఒక్కరు భాధ్యులు కారని , లేక వా రామోదిస్తారని బావించ నవసరం లేదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను. కానీ, వారితో కలసి, అనేక సమాలొచనలూ, చర్చలూ జరపడంవల్ల భారతీయ చరిత్ర, సంస్కృతుల వివిధ దృక్పధాలను గురించి నా మనసులో మసకగా ఉన్న భావాలూ విశిష్ట  రూపం దాల్చాయి.అందుకు వారికీ నా హృదయ పూర్వక కృతజ్ఞత తెలుపుకొకతప్పదు.  

              అహ్మమద్ నగర్ కోటలో నా సహచరులుగా ఉన్న పదకొండు మంది బారత దెస వైవిధ్యాన్ని ప్రదర్శించే ముచ్చటయిన వ్యక్తులు. వారనేక విధాలుగా భారత రాజకేయలకే గాక , అధునాతన పాండిత్యా లకు , వర్తమాన  భారతదేశ వివిధ ద్రుక్పధాలకు ప్రతినిధులు. భారత దేశ ప్రధాన సజీవ భాషల్లో దాదాపు అన్నిటికి భారత దేశాన్ని గతంలోనూ వర్తమానంలో కూడా గాడంగా ప్రభావితం చేసిన పరచెన భాషలకు ప్రాతినిధ్యం లభించింది. 

నేను కొన్నాళ్ళ క్రితం వ్రాసినదాన్ని, కొంతకాలానికి మల్లి చదువుతూవుంటే, ఒకవిధమైన విచిత్రనుభూతి ఇబ్బడిముబ్బడి గా ఉంటుంది. నాకు సంహితుడైన బిన్నమైన మరో వ్యక్తి రచించిన గ్రంధాన్ని చదువుతున్నట్లు తోస్తుంది. ఇది బహుశా, నాలో జరిగిన మార్పు ఒక్క పరిమాణం కావచ్చు.
                                                                                                            ...............   జవహర్ లాల్ నెహ్రు                                                                      

 
గొప్ప ప్రజాస్వామ్యవాది అయిన నెహ్రు ఆంగ్లం లో అనేక గ్రంధాలను రచించారు. తను రాసిన 'స్వీయచరిత్ర' కు కొనసాగింపుగా మరో రచనకు సంసిద్ధమైనారు . తనకు మహా ప్రేతిపాత్రమైన -- తను ప్రగాడంగా ప్రేమించే భారత మాతను గురించి రాస్తే బాగుంటుందని ' ది డిస్కవరీ అఫ్ ఇండియా " గ్రంధ రచనకు పూనుకున్నారు. ఈ గ్రంధ రచనలో అబ్దుల్ కలాం ఆజాద్,గోవింద వల్లబ్ పంత్ వంటి స్వాతంత్ర సమరయోధులు తమ తోడ్పాటు అందించారు. ఈ పుస్తకం తెలుగులో 'భారత దర్శనం ' అన్న పేరుతో వెలువడింది. వీరి రచనలలో "సోవియట్ రష్యా", గిమ్ప్లేస్ అఫ్ వరల్డ్ హిస్టరీ" " ది డిస్కవరీ అఫ్  ఇండియా " అన్నవి ప్రసిద్ధ రచనలు.

బుక్  కోసం


పేజిలు : 625

ధర : రూ 400/-


లబించు చోటు 

తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

మన తాత్విక వారసత్వం

మన తాత్విక వారసత్వం  ఎం వి ఎస్ శర్మ



                      బారత దేశ తాత్విక సంప్రదాయం అద్యత్మికమేనన్న భావన నేటికి బలంగా వ్యాపించి ఉంది. ఇక్కడ అంత పరలోకం గురించి అలోచించేవారే తప్ప, ఇహలోకం  గురించి, భౌతిక విషయాలన్ గురించి పట్టించుకోరన్న భావన అదికంగా ఉంది. భౌతికవాదం అంటే అదేదో పాచ్యత సిద్ధాంతం అని చిన్నచూపు చేసే ప్రచారం కూడా ఎక్కువగానే జరిగింది,జరుగుతున్నది కూడ. భారతదేశం లో తాత్విక ధోరణి కేవలం  అద్యత్మికమైనది, అదే అత్యున్నతమైనది అని చెప్పడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి.తొలుత వలస పాలకులకు , ఆ తర్వాత దేశీయ పాలక వర్గాలకు ఇది ఎంతో అనుకూలంగా తయారయింది. తమ దోపిడిని ప్రజలు ప్రశ్నించకుండా ఉండటానికి, సమాజాన్ని మార్చడానికి ప్రజలే పునుకోవాలన్న భావనను మరుగున పడేసేందుకు ఇలాంటి ప్రచారం వారికీ చక్కగా ఉపయోగపడింది.


                   భారత దేశ తాత్విక సంప్రదాయంలో బలమైన భౌతికవాద ధొరణుల్లున్నాయని, ఈ ధోరణులు ఆధ్యాత్మిక కేదా భావవాద ధోరణులతో తీవ్రంగా పోరాటం చేసాయని డిడి కోశాంబి ,దేవీప్రసాద్ చాతోపధ్యయలాంటి ప్రగాతిసేలా చరిత్రకారులు, తత్వవేతలు నిర్గాద్వంగా నిరూపించారు. కానీ ఆలాంటి వారి గ్రంధాలూ ఇంగ్లీష్ లో ఉన్నాయి. వారి రచనలను సరళంగా తెలుగు పాఠకులకు అందించడం అంతో ప్రాధ్యాన్యత కలిగిన కర్తవ్యం. ఈ పుస్తకం ఆలాంటి కృషి లో భాగమే...




ఈ  పుస్తకమ్  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 218

ధర : రూ 100/-


లబించు చోటు 

తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates





పుస్తక పరిచయం - భోజన భోగం

భోజన భోగం ...జి వి పూర్ణచంద్

ఆరోగ్యవంతమైన బోజనమే నిజమైన భోగం




            అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది ప్రాణాన్ని నిలుపుతోంది. ప్రాణానికొక జీవనీయతని కల్పిస్తోంది. సాక్షాతూ అన్నమే ఔషధంగా  జీవుల్ని నడుపుతోంది.

           ఆదునిక సమాజంలో అన్నం విషయంలో ఈ దృక్పధంలో కొంత మార్పు ఏర్పడింది. " ఆహారం వేరు - ఔషదాలు వేరు " అనే దృష్టి పెరిగింది. " మీ ఇష్టం వచ్చింది తినండి - ఈ బిళ్ళ వేసుకోండి " అంటేనే రోగికి డాక్టర్ నచ్చుతున్నాడు.

          సారవంతమైన కురగాయల్ని నిస్సారంగా వండుకుని తింటూ - కాళ్ళు నొప్పులూ, కడుపులో మంటలు అని నిత్యరొగ పీడితుల్లా మనం ఎందుకు మారిపోవాలి ?

         పొన్నగంటి కూర కావాలంటే మనకి ఏ కూరగాయల మార్కెట్లోనూ దొరకదు. గంగ పోవిలికూర, చక్రవర్తి కూర , చిర్రికూర, - వెతి సంగతి సరే సరి .  పొలాల గట్ల మీద పెరిగే ఈ ఔషధాలని పిచ్చి మొక్కలుగా రైతులు కూడా చాల మంది బావించడం అచ్చర్యకరమైన మార్పే. మన పెరటిలోనే ఆ పుటకు వంటకు కావలసిన మొక్కలు చాల ఉంటాయి. కానీ, తినేవి కావేమోనని వాటి జోలికి మనం వెళ్ళడం లేదు.

     ఆయుర్వేద శాస్త్రం లో ఆరోగ్యాన్ని పరి రక్షించేందుకు ఎన్నో ఆహార పదార్ధాలు - వాటిని వండుకునే విధానం, వాటి గునదోశాలు వివరాలు నిక్షప్తంగా ఉన్నాయి. అన్ని ఈ కాలంలో ప్రజలకు అవసరమే. వాటిని సామాన్య మానవుడికి అన్డుబతులుకి తెచ్చే ప్రయత్నమే ఈ " భోజన భోగం "


రచయత గురించి :
డా. జి. వి. పూర్ణచ౦దు సాహిత్యాభిలాషి. వ౦దకు పైగా పుస్తకాల రచన. వాటిలో నలభై వరకూ సామాన్యుడికోస౦ వైద్య రహస్యాలను తెలిపిన పుస్తకాలున్నాయి. “తరతరాల తెలుగు రుచులు” పరిశోధనా గ్ర౦థ౦ తెలుగు వారి ఆహార చరిత్రపైన వెలువడిన తొలిగ్ర౦థ౦గా ప్రసిధ్ధి పొ౦ది౦ది. ఆ౦ధ్రభూమి ఆదివార౦ భూమిక, నడుస్తున్న చరిత్ర, నది, చినుకు మాసపత్రికలు ఇ౦కా అనేక మాస, వార పత్రికలలో శీర్షికలు వస్తున్నాయి.  ద్రావిడ విశ్వవిద్యాలయ౦ ప్రచురి౦చిన  "నైలూ ను౦చి కృష్ణ దాకా", ఆ౦. ప్ర. అధికార భాషా స౦ఘ౦ ప్రచురి౦చిన "తెలుగే ప్రాచీన౦" గ్ర౦థాలు పరిశోధకుడిగా వీరికి మ౦చి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగు భాష ప్రాచీనతనిరూపి౦చే వ్యాసాలు అనేక౦ ప్రచురితమయ్యాయి. తెలుగు భాషకు ప్రాచీనతా హోదాను సాధి౦చట౦లో చురుకైన పాత్ర పోషి౦చారు. కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ ప్రథాన కార్యదర్శి. ప్రప౦చ తెలుగు రచయితల మహాసభలు రె౦డుసార్లు విజయవాడలో నిర్వహి౦చి భాషోద్యమానికి ఊపిరి పోశారు. తెలుగు విశ్వవిద్యాలయ౦, 30కి పైగా ఇతర స౦స్థలు పురస్కారాలతో గౌరవి౦చాయి. 2012లో తిరుపతిలో జరిగిన నాలుగవ ప్రప౦చ తెలుగు మహా సభల స౦దర్భ౦గా తెలుగు విశ్వవిద్యాలయ౦ వారు వీరి ‘మన ఆహార౦’ ఆహార చరిత్ర పరిశోధనా గ్ర౦థాన్ని ప్రచురి౦చి సత్కరి౦చారు.



ఈ రచయత పుస్తకాల కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 188

ధర : రూ 80/-


లబించు చోటు 

తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com

మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

Wednesday, February 13, 2013

పుస్తక పరిచయం - కాకాని చక్రపాణి నవలలు


కాకాని చక్రపాణి నవలలు

ఆధునిక తెలుగు కధా, నవల సాహిత్యంలో తనదయిన శైలితో ప్రతేకతను సంతరించుకున్న రచయిత డా.కాకాని చక్రపాణి. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను,అత్మేయతానుబందాలను హృద్యమైన శైలిలో రుపుదిద్దగల శిల్పి అయన. చక్రపాణి పత్రాలు నెల విడిచి సాము చెయ్యవు. అవి మనకు అంతో సుపరిచితాలనిపిస్తాయి. అవిశ్రాంతంగా సాగుతున్న అయన సాహిత్య వ్యవసాయంలో ఇప్పటివరకు పన్నెండు నవలలు, ఎన్నో కధలు లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు పండించారు. 

ఇప్పుడు కాకాని చక్రపాణి గారి నవలలు నాలుగు సంపుటాలు గా విడుదలైయినాయి.


ఈ పుస్తకాల కోసం  ఇక్కడ నొక్కండి 







లబించు చోటు 
తెలుగు పుస్తకాల కోసం 
www.logili.com

please add for new book updates

http://www.facebook.com/logilidotcom

Saturday, February 9, 2013

భారతీయ బాషా కధలు

భారతీయ బాషా కధలు (1900-2000)



 ఈ సంకలనంలో పొందుపరచిన కధలు భారతీయ భాషా సంస్కృతికి ప్రతిరూపాలు. వివిధ భాషల్లో రచించిన కధలు ఆయా ప్రాంతాల సంస్కృతి ని, భావాలను, ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ఈ విబిన్న రూపాలను ఏకం చేస్తూ సన్నని 'భారతీయత' అనే దారం కనిపించి కనిపించానట్లు ఉంటుంది. ఒక శతాబ్ధపు చరిత్ర యీ సంకలనంలో చూడవచ్చు. బాషలు వేరయినా ఆయా కాలపు ఆలోచనా విధానాలను, సమాజం లోని మార్పులను ఈ కధలు చెప్తాయి.ఈ కధలు ప్రాంతీయ బాషల సందర్భంలోనయిన  సరయిన సందర్భానే వినిపిస్తాయి.

  
                     ఈ పుస్తకం మొదటి లో భాగంలోని కధలు ఈ శతాబ్దంలోని అతి అమూల్యమైన కధలు. ఈ కధలను సాముహిక శక్తీ దేశంలోని తన ఉనికిని చాటే రుజువుగా కూడా తీసుకోవచ్చు. కోతగా పుట్టిన సమాజం ఎదుర్కొనే కష్టాలను, అడ్డంకులను పొండువరచిన కధలివి. అందువల్ల కధను మెలుకువగా చెప్పి చదువరులను ఆకట్టుకునే శక్తిని ఏవి కోల్పోలేదు. ఈ కధలను  మల్లి మల్లి చదవి మనం ఎవరమో, ఎక్కడినుండి వచమో ఈ దేసగా ప్రయనిస్తున్నమో గుర్తు చేసుకోవచ్చు.                                
                                                                                         
                                                                        - ఇ . వి.రామకృష్ణన్ 


కదా క్రమం  ఇదిగో ఇలా 



దేశ భాషల సాహిత్యాన్ని అందించే
                                                సాహిత్య ఆకాడమి
  పుస్తకాలూ    ఇకనుంచి మీ  లోగిలి   లో  లభ్యం .

ఈ పుస్తకల కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 496

ధర : రూ 220/-


లబించు చోటు 
తెలుగు పుస్తకాల కోసం 

please add for new book updates






                       

Wednesday, February 6, 2013

గోదావరి కధలు

గోదావరి కధలు 
                  .....బి వి ఏస్. రామారావు 

గోదారి తల్లిని ఆటలతో పాటలతో అర్చించిన పాగోజి బాపు తుగొజి రమణలకు మూడో పూజారి సీతారాముడు ఇస్తున్న తీర్ధ ప్రసాదాలు ఈ గోదావరి కధలు.




ఈ కధలు గోదారికి అక్షరానువాదాలు 
ఇవి బాల గోదరిలా పరవళ్ళు తొక్కుతాయి 
పడుచు గోదారిలా పొగర్లు పోతాయి.
పెద గోదారిలా ప్రేమను పంచి పెడతాయి.

ధవళేశ్వరం దిగువున తలో దిశగా ఉన్న బిడ్డల కోసం అఖండ గోదావరి మాత ఖండ గోదావరీ మాత ఖండ గోదావరయి-తల్లిగా, పిల్లగా -మనవరాళ్ళు గా - ముని మనవరాలుగా నెల నలు చేరుగులా వెళ్లి జలదనం, అన్నదానం, ఐశ్వర్య దానం  ఈ కధల ద్వారా ఆనంద  దానం చేసింది - చేస్తూనే ఉంటుంది.

మూడొందల పేజీల్లో కొలువు దీరిన ఈ కధల గురుంచి నా కిష్ట మై నంత  చెప్పాలంటే మూడువేల పేజీలు చాలవు. అందువల్ల మూడు ముక్కల్లో చెబుతాను.

నాకు వాడంటే అసూయ .....
టెలుగు మాత్రం తెలిసిన వారికి - ఆంగ్లంలో ఐ యాం జేలస్ .
                                                                                       ........ముళ్ళపూడి వెంకటరమణ .

  



ఈ పుస్తకాల కోసం  ఇక్కడ నొక్కండి 



పేజీలు : 272
ధర : రూ 150/-




లబించు చోటు 
తెలుగు పుస్తకాల కోసం 
www.logili.com

please add for new book updates

http://www.facebook.com/logilidotcom