గోదావరి కధలు
.....బి వి ఏస్. రామారావు
గోదారి తల్లిని ఆటలతో పాటలతో అర్చించిన పాగోజి బాపు తుగొజి రమణలకు మూడో పూజారి సీతారాముడు ఇస్తున్న తీర్ధ ప్రసాదాలు ఈ గోదావరి కధలు.
ఈ కధలు గోదారికి అక్షరానువాదాలు
ఇవి బాల గోదరిలా పరవళ్ళు తొక్కుతాయి
పడుచు గోదారిలా పొగర్లు పోతాయి.
పెద గోదారిలా ప్రేమను పంచి పెడతాయి.
ధవళేశ్వరం దిగువున తలో దిశగా ఉన్న బిడ్డల కోసం అఖండ గోదావరి మాత ఖండ గోదావరీ మాత ఖండ గోదావరయి-తల్లిగా, పిల్లగా -మనవరాళ్ళు గా - ముని మనవరాలుగా నెల నలు చేరుగులా వెళ్లి జలదనం, అన్నదానం, ఐశ్వర్య దానం ఈ కధల ద్వారా ఆనంద దానం చేసింది - చేస్తూనే ఉంటుంది.
మూడొందల పేజీల్లో కొలువు దీరిన ఈ కధల గురుంచి నా కిష్ట మై నంత చెప్పాలంటే మూడువేల పేజీలు చాలవు. అందువల్ల మూడు ముక్కల్లో చెబుతాను.
నాకు వాడంటే అసూయ .....
టెలుగు మాత్రం తెలిసిన వారికి - ఆంగ్లంలో ఐ యాం జేలస్ .
........ముళ్ళపూడి వెంకటరమణ .
No comments:
Post a Comment