Thursday, February 28, 2013

కరుణ శ్రీ బాల సాహిత్యం

తెనుగుదనము వంటి తీయధనము లేదు ;
తెనుగు కవుల వంటి ఘనులు లేరు ;
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలిత సుగుణజాల ! తెలుగు బాల !



"తెలుగు బాల " తెలుగు  బాల లందరికి ముద్దుల చెల్లాయి . చెల్లాయిని చేతుల్లోకి తీసుకుని లాలిస్తే మీకు మంచి మాటలు చెబుతుంది . సూక్తులు వినిపిస్తుంది . నీతులు భోదిస్తుంది . పెద్ద పెద్ద పుస్తకాలలోని బావాలన్ని చిన్న చిన్న పద్యాల్లో మీకు స్పష్టం చేస్తుంది . అందమైన పద్యాలు పాడి మీ అందరికి ఆనందాన్ని అందిస్తుంది . ..కరుణ శ్రీ


తెలుగు బాల ! నీ పంట పండింది . నిజంగా అదృష్టమంటే నీదే . పెద్దపెద్ద వాళ్ళకు అర్ధమయ్యేలా పెద్దపెద్ద పుస్తకాలు వ్రాసిన శ్రీ శాస్త్రి గారు బంతిలో బాలపక్షం లేకుండా నీకోసంగూడ కలంబట్టి , నీ తాహతుకు తగినట్టుగా ముద్దులొలికే చిన్న చిన్న పద్యాలూ వ్రాసి , నేకు బహుమానం గా ఇచ్చారు.

             శాస్త్రి గారి పూర్తి పేరేమిటో తెలుసా! శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు . వీరు చాలారోజుల నుంచి మీ పెద్దవాలందరికీ పరిచయమైనవారే . మీ పెద్దవాల్లందరికి వీరి పద్యాలు ఎంత యిష్టమనుకున్నావ్ ! అయిన మీ అన్నయ్య నో , నాన్ననో , అమ్మనో అడిగి చూడు . నా మాట అభద్దమేమో తేలుతుంది .
       
              మరే, ఇంకో చిన్న రహస్యముంది , అసలు పేరు పాపయ్య శాస్త్రి గారా , అదిగాక ఇంకో పేరు కూడా ఉంది వీరికి. ఆ పేరు వారు వ్రాసిన పుస్తకాలపైన కనపడుతుంది . ఆ పేరంటే వారికెంత యిష్టమనుకున్నావ్ ! తొందర పడబోకు చేబుతామారి ; ఆ పేరే "కరుణశ్రీ"

             "లలిత సుగుణజాల ! తెలుగుబాల ! " అంటూ ఆప్యాయంగా పిలుస్తూ , మీకిష్టమయ్యే మాటల్లో తేలిగ్గా , ఉండేటట్లు , బెదిరిపోకుండా , ముద్దు ముద్దుగా కొన్ని నీతులు , కొన్ని రహస్యాలు , కొన్ని అనుభవాలు చెప్పారు. వాటినన్నిటినీ శ్రద్ధ తో , ప్రేమతో చదివి అర్ధం చేసుకొని మరి వారు చెప్పినట్లు నడుచుకుంటారు గదూ !

                                                                                                          -----------  "ధనకుధరం "

కరుణ శ్రీ గారు వ్రాసిన ఈ పుస్తకం లో తీయటి పద్యాలతో పాటు మంచి మంచి  కధలు , చిన్న చిన్న నవలలు ఎన్నెనో ఉన్నాయి.
ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 454
ధర : రూ 275/-


తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates



No comments:

Post a Comment