Wednesday, February 27, 2013

పుస్తక పరిచయం - స్పూర్తి పాటలు

స్పూర్తి పాటలు 

' జిలుగు వెలుగుల చేరనేసినా
జీవగంజే కరువురా
పసిడి కాంతుల వెన్నలద్ధినా
పుట గడవని బతుకురా '
నూలునంతా తీసుకొచ్చి - అందమైన రంగులద్ది
ఏడు పోట్టెలు కలిపినావు - చిట్టెలాగా చుట్టినావు
పొద్దునుండి రాత్రి వరకు  - రాట్నమెంత తిప్పుతున్నా
కండె చుట్టూ దార మాయే - కంటి నుండి దార లాయె
రబ్బర్లు చుట్టి రంగులేసి - పంటే మీద చిటికె తెచ్చి
కన్నబిడ్డకు తెల్లివోలె - చిక్కు లేసి దారమంత
తీరు తీరున బొమ్మలన్నీ - అందంగా ఆసు పోసినా
చీరలన్ని మెరిసి పోయె - నేసినోల్లె ఎలిసిపోయే '

అంటూ ప్రతి పాట  సగటు మానవుడి జీవితం లో భాదని  కళ్ళకు కట్టి నట్లు చూపి గుండెల్లో చెరగని ముద్ర వేస్తుంది.



ఎక్కడ సమస్య ఉంటె ఎక్కడ పోరాటముంటే అక్కడ స్పూర్తి ఉన్నదౌ. ఒక సుదీర్గ పోరాట క్రమం లో అతను భాగస్వామ్యం . స్పూర్తి పాటలు మన గుండెల్లో ఒదిగి పోతాయి.                       ....... శివా రెడ్డి


ఈ పాటలన్నీ ఏదో ఒక మహా సభకు తరలి వెళ్ళుతున్న కార్యకర్తల్లా కనిపించాయి. ఎవరికీ వారు సభా ప్రాంగణానికి త్వరగా చేరుకునేందుకు ప్రయత్నించి గబ  గబా ముందుకు సాగుతునట్లు సాగిపోయాయి. దేనినో తుదముట్టించడానికి లేదా శత్రువును అంతం చేయడానికి సకల దిక్కులా నుంచి ముట్టడిస్తున్న మనషుల్లా ఈ పాటలు కనిపించాయి . ఈ సంపుటి మొత్తం చదివాకా నా కళ్ళ ముందు ఒక 'ఒక ఎర్ర నారు మది ' కనిపించిది.
                                                                                                              .......... సీతారాం

స్పూర్తి రాసిన ప్రతీ పాటా ప్రజావ్యతిరేక విధానాలపై ఒక తూట. బ్రతుకులకు భద్రత లేకుండా చేస్తున్న వ్యవస్థ పై నిప్పుల వర్షం కురిపిస్తాయి. సమాజాన్ని మార్చాల్సిన అవసరాన్ని గుండెను తట్టి చెప్తాయి.....  వోరప్రసాద్ 




ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 366

ధర : రూ 200/-


తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

No comments:

Post a Comment