Tuesday, February 26, 2013

ముద్ర


మూడు భారతీయ భాషలలో సంచలనం సృష్టిoచిన తెలుగు నవల


కోటమ్మ దళిత యువతి . తమకు లొంగ లేదన్న కసితో ఆ ఊర్లోని సర్పంచ్ ముసలయ్య , ఆ ఊర్లో పూజారి శాస్త్రి తో కుట్రపన్ని ఆమెను బసివినిగా మార్చడం అనే ఈ నవలలో ప్రధాన సంఘటన మన హృదయాలను ద్రవింప జేస్తుంది . నవల ప్రారంభంలో హసీనాగా పరిచయమైనా స్త్రీయే కోటమ్మ అని తెలిసినప్పుడు మనం చాలా అశ్శర్య పడతాం . తన జీవితం ఎలాగు నాశనమైంది . తను ఎప్పుడో వడలిపోయి , తిరిగివచ్చి తన కూతురి జీవితాన్నైనా బాగు చెయ్యాలన్న పట్టుదలతో ఆమె సమాజంతో చేసిన పోరాటం ఆమె తెచ్చిన నిశభ్ధ విప్లవం ఎందరో దళితవర్గాలకు చెందినా స్త్రీలకు స్పురి దాయకంగా నిలుస్తుంది.  
నిమ్న వర్గాలకు చెందిన యువతులను అగ్రవర్ణాలవారు తమ లైంగిక సుఖం కోసం బసివినులుగా మార్చే దుష్ట , దుర్మార్గ సంప్రదాయాన్ని చిత్రిస్తూ వి. అర్. రాసాని ఈ నవలను రచించాడు . రాయలసీమ ప్రాంతంలో బసివిని వ్యవస్తకు వ్యతిరేకంగా పోరాడిన స్త్రీల జీవితాలను రాయలసీమ ప్రాంత పలుకుబళ్ళతో ఎంతో సహజంగా పాటకుల హృదయాలను ద్రవించేలా చిత్రించిన రాసానిని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను . 
                                                                                                         ...... అంపశయ్య నవీన్

ఈ నవలలిక చతురలో వచ్చింది, మంచి పేరొచ్చింది . కన్నడంలోకి వెళ్లి, అప్పుడే రెండు కాపులు కాసింది . 'ముద్ర'ఇప్పటికే జనామోదం పొంది, తనని తను నిరూపించుకుంది . కన్నడ,హిందీ,తమిళ బాష  లొకిఅనువాదమై ముద్రపడింది . ఇక సంతృపతకరమైన ముగింపునిచ్చింది. ముద్ర నవలని నడిపించిన తీరు అర్ధవంతంగా, ఆసక్తికరంగా సాగింది .               ................................ శ్రీ రమణ

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 192

ధర : రూ 120/-


తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

1 comment:

  1. చదవాలనిపించే పుస్తకాన్ని పరిచయం చేసారు....థ్యాంక్యూ!

    ReplyDelete