Tuesday, January 29, 2013

జీవన గీతం

జీవన గీతం   

                 ....ఖలీల్ గిబ్రాన్ 



పని ప్రేమను కనపడేలా చేస్తుంది 

ప్రేమ తో కాకుండా అయిష్టంగా తప్ప పని చెయ్యలేకపోతే మీ పనిని వదిలిపెట్టి సంతోషంతో పనిచేసేవాళ్ళ మందిరం దగ్గర కుర్చుని బిచ్చం అడుక్కోవడం మంచిది......ఖలీల్ గిబ్రాన్ 


కవి,తత్వవేత్త,కళాకారుడైన గిబ్రాన్ లెబనాన్‌లో పుట్టాడు.గిబ్రాన్ రాసిన ఈ అద్బుత పుస్తకం గత శతాబ్దంలో ఎందరో అభిమానాన్ని చూరగొంది.1923లో మొదట ప్రచురితమయిన ఈపుస్తకం ఇప్పటివరకు 40కి పైగా భాషలలోకి అనువాదం అయ్యింది. లక్షలాది ప్రతులు అమ్ముడుపోయాయి. తెలుగులోనే ఇప్పటివరకు నాలుగు అనువాదాలు ప్రచురితమయ్యాయి.

ప్రతి మనిషి జీవితంలోని అనేక మౌలిక అంశాల గురించి "ప్రవక్త" మాట్లాడాడు: ప్రేమ,ఇవ్వటం,ఆహారం,పని,సంతోషం,దుఃఖం,పిల్లలు,బట్టలు,ఇళ్లు,అమ్మటం,కొనటం,నేరమూ,శిక్ష, స్వేచ్ఛ,హేతువూకాంక్ష,ఆత్మజ్ఞానం, స్నేహం ప్రార్ధన,ఆనందం,అందం,మతం,మరణం...ఇవన్నీ ప్రతి ఒక్కరికి సంబంధించినవే.

తను రాసిన వాటిల్లోకెల్లా 'ప్రవక్త ' గొప్పదిగా గిబ్రాన్ భావించాడు.గిబ్రాన్ మాటలలో:  "లెబనాన్ కొండలలో ఉన్నప్పుడు ఈ పుస్తకం రూపుదిద్దుకున్న తొలిసారి నుండి అది నా వద్ద ఎప్పుడూ ఉండేది. అది నాలో ఒక భాగం అయిపోయినట్లు ఉండేది...దీనిని ప్రచురణకర్తకు ఇచ్చేముందు నాలుగు సంవత్సరాలు నాతోపాటు ఉంచుకున్నాను.ప్రతి ఒక్క మాట నేను రాయగలిగినదాంట్లో అత్యుత్తమమైనదిగా నిర్ధారించుకున్న తరవాతే దానిని ప్రచురణకు ఇచ్చాను."


ఈ పుస్తకం కోసం ఇక్కడ నొక్కండి 


లబించు చోటు 
తెలుగు పుస్తకాల కోసం 
www.logili.com

please add for new book updates

http://www.facebook.com/logilidotcom


No comments:

Post a Comment