Thursday, January 31, 2013

ఓ.హెన్రీ కధలు







కధలు రాస్తున్నవారు బాగా రాసేందుకు, రాసిన వారు మరింత ఉన్నతంగా 

రాసేందుకు, కోత్తగా రాయాలనుకునేవారు - తప్పక చదవాల్సిన కధలు 

పేద,మధ్య,ధనిక ప్రజల జీవితాలను ఔపోసనపట్టి కధలుగా మలిచిన కధా 

శిల్పి! విశ్వ 'కధా ప్రపంచం' లో విశిష్ట కధక చక్రవర్తి, సుప్రసిద్ధ అమెరికన్ 

రచయిత.

కధా రచనలో ఒక చురుకుదనం, ఆసక్తి, హాస్యం, సస్పెన్సు, ఉద్రేకాన్ని చొప్పించి సరళమైన శైలిలో ఆశర్యకరమైన ముగింపులతో పాటకుల మనస్సులను చూరగొన్నాడు. ఓ.హెన్రీకి మాములు ప్రజలు, ప్రదేశాలు అంటే అంతో ఆసక్తి ఉండేదని అయన కధలు తెలియజేస్తాయి. ముఖ్యంగా న్యూ యార్క్ , మిగిలిన నగరాలలో, మురికి వాడల్లో నివసించే అతి సామాన్య ప్రజా, తాగుబోతులు, పోలీసులు, అంగళ్ళలో, బార్లలో పనిచేసే అమ్మాయిలు, గుమాస్తాలు, సంసారం చేస్తున్న భార్యాభర్తలు, వాళ్ళ పాట్లు , ప్రేమికులు - వాళ్ళ ఇక్కట్లు, ఇంటి యజమనురాళ్ళు ఓ.హెన్రీ కధలలో ముఖ్య పాత్రలు. ధనవంతులు కూడా కధలలో దర్శనమిస్తుంటారు.

ఈ సామాన్య ప్రజల వేషభాషలు, దుస్తులు, హవభావాలు, ఆలోచనలు, కష్టసుఖాలు , ఆవేశాలు, ఆహార వ్యవహారాలు మనకు కళ్ళకు కట్టినట్లు , హాస్యాన్ని, మానవతా దృక్పధాన్ని సమపాళ్ళలో మేళవించి, మనముందు నిలబెడతాడు . ఓ. హెన్రీ కధలు చాలామటుకు సమకాలీన పరిస్త్తితులను, పరిసరాలను మనకు తెలియజేస్తాతాయి.

సాహిత్యలోకానికి వాణిజ్యపరంగా కధలను ప్రవేశపెట్టిన ఘనత ఓ.హెన్రీ దే. తన ప్రత్యేక శైలి లో రాసిన కదల తో అమెరికాలోను , ఇతర దేశాలలోను ఎన్నో తరాలను ప్రభావితం చేసాడు ఓ.హెన్రీ. పాటకులకు అతి త్వరగా ప్రీతీ పాత్రుడై పోయాడు. అతడు కధల్ని అతి వేగంగా రాసేవాడు. కానీ వాటిని ఒకసారి తిరిగి చదవటం అలవాటు చేసుకోలేదు. అయిన గొప్ప జనాదరణ పొందాడు.

ఈయన రాసిన కధలలో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన కధలు కొన్ని :
The gift of the Magi( విజ్ఞుల బహుమతులు )
The Skylight రూం( ఆకాశ గవాక్షం)
The Third Ingredient( మూడవ దినుసు)
The last లేఆఫ్( చిట్ట చివరి ఆకు)
The cop and the Anthem ( పొలిసు - భక్తి గీతం ).
ఈ పుస్తకం కావలసినవారు ఇక్కడ   O.Henry   నొక్కండి.



లబించు చోటు 
తెలుగు పుస్తకాల కోసం 
www.logili.com

please add for new book updates

http://www.facebook.com/logilidotcom



No comments:

Post a Comment