Thursday, April 18, 2013

పాకుడు రాళ్లు



సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రభావంతంగా బొమ్మకట్టించిన తోలి తెలుగు నవల.
        మద్రాసులో ముడున్నరేళ్ళు 'చిత్రసీమ' సినిమా పత్రికలో పనిచేస్తూ సినిమా తారల భేటీలెన్నో దిద్దాను. రిపోర్టర్లతో ఉన్న సాహిత్యంతో వారి ద్వారా తెలుసుకున్న వివరాలు నేను స్వయంగా తెలుసుకున్నవి గుదిగుచ్చి ఒక కధ రాశాను. మంచి స్పందన రావడంతో 'మాయాజలతారు' నవలను రాశాను. దీనికే పాకుడు రాళ్లు పేరు మార్చారు శీలా వీర్రాజు. నాకు ఇష్టమైన నవల ఇది. రాజకీయం,సినిమా మహా సముద్రం లాంటివి. ఎంతరాసిన తక్కువే.
                                                                                      ...... రావూరి భరద్వాజ 
                                              
రావూరి భరద్వాజకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం 2013 కు గాను  లభించింది. చిత్ర పరిశ్రమలో వ్యక్తుల అంతరంగాలను అద్భుతంగా అవిష్కరించిన 'పాకుడురాళ్లు 'నవలకు ఈ పురస్కారం దక్కింది. ఈ పురస్కారం వరించిన తెలుగు వారిలో ఆయన మూడో వ్యక్తి. తొలిసారిగా 1970లో విశ్వనాథ సత్యనారాయణ 'రామాయణ మహావృక్షం' రచనకు దక్కిన ఈ పురస్కారం.. తర్వాత 1988లో 'విశ్వంభర' రచనకు గానూ సి.నారాయణరెడ్డిని వరించింది. ఆ తర్వాత సరిగ్గా పాతికేళ్ల అనంతరం జ్ఞాన్ పీఠ్ పురస్కారం మరోసారి తెలుగు రచయిత తలుపు తట్టింది.

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 


తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates


No comments:

Post a Comment