మేం మళ్ళీ వస్తాం
ఇరవైయవ శతాబ్దపు మొదట భాగంలో మహత్తర విజయాలు సాధించిన సోషలిజం, రెండోభాగంలో కుప్పకూలిపోయింది. ప్రపంచంలో మూడవ వంతుగా ఉన్న సోషలిస్ట్ శిబిరం అదృశ్యమై, కాపిటలిజం మాజీ సోషలిస్ట్ దేశాలకు కూడా విస్తరించి నేడు కాపిటలిజానికి ప్రత్యామ్నాయం లేదు అనిపిస్తోంది.
ఒక వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదు అనిపించే పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆ వ్యవస్థ సంపూర్ణ విజయం సాధించినట్లే. ఈ అర్ధంలో కాపిటలిజం,సోషలిజం మీద సంపూర్ణ విజయం సాధించిందని మనం అంగీకరించవచ్చు. మన మనసు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, నేటి వాస్తవ పరిస్థితి ఇది.
కానీ.....
ప్రపంచ వ్యాపితంగా కమ్యునిష్టు ఉద్యమం చిన్నా భిన్నమయిపోయి, ' మార్కిజాన్ని నిలువులోతులో పూడ్చి పెట్టేశాక ' కాపిటిలిజం సురక్షితంగా ఉందా ? లేక 'కమ్యునిస్ట్ భూతం' ఇంకా దాన్ని వెన్నాడుతూనే ఉందా?
సోషలిస్టు శిబిరం ఎందుకు, ఎలా కూలిపోయింది ? ఈ ఘోరపరాజయం తో అంతా ముగిసిందా? లేక వెనక్కు మళ్ళిన విప్లవతరంగం ఈ శతాబ్దంలో మరింత విస్తృతంగా, మరింత ఉదృతంగా మరోసారి విరుచుకు పడబోతోందా ?
సోషలిస్ట్ శిబిర పతనం తర్వాత 'మార్కిజం మరణించిందా ? లేక సజీవంగా ఉందా?
అసలు మార్కిజం అంటే ఏమిటి ? సోషలిజం అంటే ఏమిటి ?
చదవండి చదివించండి చర్చించండి
.......తాళ్ళపల్లి మురళీధర గౌడ్
ఈ పుస్తకం కోసం ఇక్కడ నొక్కండి
తెలుగు పుస్తకాల కోసం
మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు నచ్చిన, మెచ్చిన పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.
No comments:
Post a Comment