Sunday, March 17, 2013

నోముల పురస్కార కధలు


నోముల పురస్కారం పొందిన పది ఉత్తమ కధల సమాహారం.
ఈ పుస్తకం లో మొదటి అయిదు కధలు 2010 లో , తరువాత అయిదు కధలు 2011 లో పురస్కారం పొందాయి.


           వై.శ్రీ రాములు కధ 'అటు అమెరికా ఇటు ఆమడగూరు' వర్తమానాన్ని చిత్రించిన మంచి కధ. భూమి విలువను, దానితో మానవుని సంబంధాన్ని మనసుకు హత్తుకొనేటట్లు చెప్పిన కధ. 'విద్వంసం' బొగ్గు కరిమికుల చీకటి బతుకులను చిత్రించిన కధ. ఈ కధ లో పాటకుడి చేత కంట తడి పెట్టిస్తాడు రచయిత ఓదెల వెంకటేశ్వర్లు. మూడవ కధ 'కలం మారినా స్తానం మార లేదు' దళితులు ఉద్యోగాలు చేస్తున్నా సమాజం వారిని అమానవీయంగానే చూస్తుంది అని రచయిత ఆకుల రాఘవ ఈ కధలో చెప్పినారు. 'ఉమ్మెత్త పూలు' శిరంశెట్టి కాంతారావు తెలుగు సాహిత్యానికి అందించిన విలువైన కధ . కాలుష్యానికి తల్లడిల్లుతున్న 'కిన్నెరసాని'ని హృదయంతో చిత్రించినారు. సామాన్యుల చైతన్యం ఏకమైన తీరును నేర్పుగా చెప్పినారు. ఐతా చంద్రయ్య ' పావుల వడ్డీ' కధ ప్రచార పధకాలకు విలువనిచ్చే సర్కారుకు చెంప దెబ్బ. పావుల వడ్డీ రుణాల కోసం పేద మహిళలు పడుతున్న పాట్లు అవి చివరకు ఎందమావులుగా మారుతున్నా తీరు ఆలోచింప చేసేదిగా ఉంది.

           వసుంధర 'వ్యక్తిగతం'కధ మారుతున్న కాలాన్ని చిత్రించిన కధ. భార్య భర్తల ప్రేమ, ఆచరణాత్మక జీవితం చిత్రించడంలో పరిణతి కనిపిస్తుంది. ఆలోచన రేకేతించే మంచి కధ ఇది. ' లోతు ...." రామా చంద్ర మౌళి కధ.డబ్బు వెంట మనిషి ఉరుకులు పరుగులు పెడుతున్నంత కాలం మనశ్శాంతి ఉండదు అని చెప్పే కధ. వర్తమాన జీవితం లో సెల్ ఫోన్ మనిషిని ఎంత అల్లకల్లోలానికి గురిచేస్తుందో ఎన్నం ఉపేందర్ 'నెట్ వర్క్ ఫెయిల్యూర్ ' కధలో చక్కగా చిత్రించినారు.నాగరికులమని చెప్పుకునే వారికంటే గ్రామీణ పేదల ఆలోచనే మానవీయం గా ఉంటుందని. మనశ్శాంతినిస్తుందని చెప్పిన కధ సత్యాజి రాసిన 'ఆనందమే జీవిత మకరందం'ఎదుట వారికీ సహాయం చెయ్యడంలో తృప్తి ఉందని 'జీవనవేదం'కధలో మంచికంటి అందంగా చెప్పినారు. ఉత్తమమైన ఈ కధలను పాటకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
                                                                                ........ఎలికట్టె శంకర్ రావు 



ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 134

ధర : రూ 80/-


తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates
    

No comments:

Post a Comment