'చినరావూరు లోని గయ్యాళులు' కధలో గ్రామీణ స్త్రీల చమత్కారాలు, గయ్యాళితనం, గ్రామస్తులలో ఉండే అంటారనితనం వగైరా దురాచారాలు సందర్భానుసారం చక్కగా వివరించిన తేజస్విగారి శైలి పాటకులను ఆకట్టుకుంటుంది. ఈ కధలలో తేజస్వి గారు అతి నేర్పరితనం తో చేసిన కధనం కారణంగా మహిళలలో వివేచన పెరిగి,అది చినికి చినికి గాలివానగా మారి చివరకు రాష్ట్ర ప్రభుత్వాన్నే పడగోట్టగలిగే స్తాయికి చేరిందంటే ఆ కధ సామాన్య ప్రజానీకం పై ఎంతటి ప్రభావాన్ని నేరిపిందో వేరే చెప్పనవసరం లేదు .
ఇలా చెప్పుకుంటూ పోతే,ఈ పుస్తకంలో చేలా విశేషాలున్నాయి.అయినా తినబోతూ రుచులేందుకు ? ఈ కధలన్నీ ఒకదానిని మించి మరొకటి పాటకులను తప్పక ఆకట్టుకుంటాయి. ఆణిముత్యాల వంటి 17 కధలు చక్కగా అలరిస్తాయి.
ఈ పుస్తకం కోసం ఇక్కడ నొక్కండి
పేజిలు : 225
ధర : రూ 200/-
తెలుగు పుస్తకాల కోసం
మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు నచ్చిన, మెచ్చిన పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.
No comments:
Post a Comment