Tuesday, March 19, 2013

వేగు చుక్క వెనిజులా

వేగు చుక్క వెనిజులా         


   
                     క్యూబా అధినేత పైడల్ కాస్ట్రో తరువాత వెనిజులా అధ్యక్షుడు చావెజ్ పేరు లాటిన్ అమెరికాలోను మొత్తం ప్రపంచ వ్యాప్తంగాను మార్మోగుతున్నది. దీనికి కారణం అయన కూడా కాస్ట్రో మాదిరిగా అమెరికా సామ్రాజ్యవాదులను నికరంగా నిలబడి ప్రతిఘటించడమే. అందుచేతనే అమెరికా అమెరికా సామ్రాజ్యవాదులు కుట్రపన్ని తమకు అనుకూలమైన ట్రేడ్ యూనియన్ లు ,ప్రతిపక్షాలను రంగంలోకి దింపి 2002 లో చావెజ్ పదవీచ్యుతుని చెసరు. కానీ ప్రజా ఉద్యమాల మద్దతుతో చావెజ్ మళ్ళీ అధ్యక్ష పదవిని చేపట్టారు . ఆ చారిత్రిక ఘట్టం తర్వాత కొద్ది రోజులకే మార్టా ఆయనతో సుదీర్ఘ ఇంటర్వ్యూ జరిపారు . ఆ సంభాషణలకు గ్రంధ రూపమే ఇది . పలు అంశాలపై చావెజ్ తన అభిప్రాయాలను ఈ ఇంటర్వ్యూ లో సూటిగా పేర్కొన్నాడు .

మార్తా హర్నకర్ లాటిన్ అమెరికాలో ఉంటూ ఆ ఖండంలో వామపక్ష ఉద్యమాల గురించి పలు రచనలు చేశారు .



ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates


Monday, March 18, 2013

ప్రపంచం లోని జంతువులు

ప్రపంచం లోని జంతువులు
మొత్తం రంగు రంగుల పేజీలలో , పూర్తిగా తెలుగు లో... మీ కోసం



జంతువుల ప్రపంచం లో సాహసాలు మరియు కీటకాల నుండి గబ్బిలాల దాకా, మొసళ్ళ నుండి కోతుల దాక మరియు ఏనుగుల నుండి ఈల్ చేపల దాకా విచిత్రమైన మరియు అద్బుతమైన జంతువులను చుడండి.


ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా....

కీటకాలు ఎక్కడ నివసిస్తాయి ?
తిమింగలం ఎంత పెద్దగా ఉంటుంది ?
అన్నిటికన్నా అతి పెద్ద పిల్లి ఏది ?


అనేక వాస్తవాలు, దృష్ట్యాoతాలు (ఉదాహరణలు)
మరియు చిత్రాలతో మీరు జంతువుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నవన్ని మీరు లోపల తెలుసుకుంటారు.



ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates


Sunday, March 17, 2013

త్వమేవాహం

త్వమేవాహం
                      ...ఆరుద్ర



నువ్వు ఎక్కదలుచుకున్న రైలు
ఎప్పుడు ఒక జీవితకాలం లేటు 
ఏళ్ళు పూల్లు నిరీక్షింలేక
ఎక్కేస్తావేదో ఒక బండి 
నీ ఆదర్శాల లగేజి 
ఎక్సేసంటాడు  టి . ఐ . సి . 
నీ ఈప్సితాల ట్రంకు పెట్లు 
కలల బ్రేకులో పారేయాలి 
నువ్వు తెచ్చుకున్నవన్ని  
ఎక్కించీ లోపున 
కదిలిపోతుంది బండి 
అందుకే అందులో కొన్ని నీ అభిమాన హీరోల దగ్గరే 
ఒదిలెయ్య్ 
నువ్వు వెల్లదలుచుకొన్న ఊరు 
నువ్వు బతికుండగా చేరదా రైలు 
దేవుడా ! ఇంత చేసావా అని 
ఉన్న ఉళ్లొనె ఉండు !


నీటి గడియారం ... ఆరుద్ర

"త్వమేవాహం - వేదనాశకలం - తధాస్తు" తర్వాత చేరిన "ఆవాహన"లతో కూడిన ఈ కావ్యంలో తెలుగు సాహిత్యంలోని ప్రాచీన కవితా రూప శిల్పమే గాక,ఆధునిక పాశ్చ్యాత కవితా సంపర్కంవల్ల అనేకానేక విన్నూత ప్రక్రియలు,ఆలోచనా ధోరణులు,చిత్రణలు, చమక్కులు ఎన్నోన్నో కనిపిస్తాయి."కొరకరాని కొయ్య"గా కొంతమంది పైకి కనిపించే ఈ కావ్యం మ్రిండుగు పడిన కొలది తియ్యటి తేనెల తేన్పులు వస్తుంటాయి. మేధస్సు పని చేసిన కొలదీ ఆరుద్ర ఈ కావ్యంలో పొందిన మహోద్రేకంతో ఆవేశంతో పాతకుడు తాదాత్మ్యం పొందుతాడు. అంతకన్నా కవి ఆశించవలసినదేమున్నది?
                                                                                          ......తుమ్మల వెంకట రామయ్య



ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates




సాహస యాత్రికులు

"ప్రపంచమొక పద్మవ్యూహం, ప్రయాణమొక తీరని దాహం"


                  ఈ సువిశాల భారతావని వివిధ ప్రాంతాలవారి సంప్రదాయాలు, జీవన విధానాలు, వివిధ భాషల సమన్వయాన్ని,జాతీయ సమైక్యత,సమగ్రత, సంఘటి చేయడానికి,దేశం గురించి తెలుసుకోవడానికి అన్ని కొన్నాల్లో వీక్షించి యువతరంలో దీప్తిని స్పూర్తిని కలిగించడానికి, అధ్యయనం చేయడానికి ఈ సాహస యాత్రలు కొంతవరకు అండగా ఉంటాయి.    


                  అలమూరి విక్రమ్ గత మూడు దశాబ్దాల కాలం లో  పత్రికలూ మిత్రుల నుంచి సమాచారం సేకరించి, మీ ముందుంచుతున్నారు. ఈ పుస్తకాన్ని 4 విభాగాలు వర్గీకరించారు.

1. కాలి నడకన సాహస యాత్రికులు 
2. సైకిల్ పై సాహస యాత్రికులు 
3. సాగర సాహస యాత్రికులు 
4. విమాన సాహస యాత్రికులు 

అట్లాగని ఈ పుస్తకమేదో పెద్ద గ్రంధం అనుకోవద్దు . ఆ ఆ  యాత్రికుల పరిచయ పుస్తకం గా బావించవచ్చు . 



ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 188

ధర : రూ 90/-


తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

నవ్య కవితా రూపం నానీ వివేచన

"నవ్య కవితా రూపం నానీ వివేచన" పరిశోధనా గ్రంధం నానిఇల కవితావికాస తాత్వికతలను సమగ్రంగా వివరిస్తూ రేపటి నానీల కవులకు,పరిశోధకులకు కరదీపికగా నిలబడుతుంది. 


పేదవాడు అరెస్టయితే 
జైలుకు
మరి పెద్దవాడు
ఆసుపత్రికి 
(శ్రీరామమూర్తి )

వివాహమా
ఎంత పనిచేశావు
నా పుట్టింటికే
నన్ను అతిధిని చేశావు
(సి.భవాని )


(ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నుండి పీ హెచ్ డీ డిగ్రీ పొందిన సిద్ధాంత వ్యాసం ) 


ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 204
ధర : రూ 150/-


తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates



నోముల పురస్కార కధలు


నోముల పురస్కారం పొందిన పది ఉత్తమ కధల సమాహారం.
ఈ పుస్తకం లో మొదటి అయిదు కధలు 2010 లో , తరువాత అయిదు కధలు 2011 లో పురస్కారం పొందాయి.


           వై.శ్రీ రాములు కధ 'అటు అమెరికా ఇటు ఆమడగూరు' వర్తమానాన్ని చిత్రించిన మంచి కధ. భూమి విలువను, దానితో మానవుని సంబంధాన్ని మనసుకు హత్తుకొనేటట్లు చెప్పిన కధ. 'విద్వంసం' బొగ్గు కరిమికుల చీకటి బతుకులను చిత్రించిన కధ. ఈ కధ లో పాటకుడి చేత కంట తడి పెట్టిస్తాడు రచయిత ఓదెల వెంకటేశ్వర్లు. మూడవ కధ 'కలం మారినా స్తానం మార లేదు' దళితులు ఉద్యోగాలు చేస్తున్నా సమాజం వారిని అమానవీయంగానే చూస్తుంది అని రచయిత ఆకుల రాఘవ ఈ కధలో చెప్పినారు. 'ఉమ్మెత్త పూలు' శిరంశెట్టి కాంతారావు తెలుగు సాహిత్యానికి అందించిన విలువైన కధ . కాలుష్యానికి తల్లడిల్లుతున్న 'కిన్నెరసాని'ని హృదయంతో చిత్రించినారు. సామాన్యుల చైతన్యం ఏకమైన తీరును నేర్పుగా చెప్పినారు. ఐతా చంద్రయ్య ' పావుల వడ్డీ' కధ ప్రచార పధకాలకు విలువనిచ్చే సర్కారుకు చెంప దెబ్బ. పావుల వడ్డీ రుణాల కోసం పేద మహిళలు పడుతున్న పాట్లు అవి చివరకు ఎందమావులుగా మారుతున్నా తీరు ఆలోచింప చేసేదిగా ఉంది.

           వసుంధర 'వ్యక్తిగతం'కధ మారుతున్న కాలాన్ని చిత్రించిన కధ. భార్య భర్తల ప్రేమ, ఆచరణాత్మక జీవితం చిత్రించడంలో పరిణతి కనిపిస్తుంది. ఆలోచన రేకేతించే మంచి కధ ఇది. ' లోతు ...." రామా చంద్ర మౌళి కధ.డబ్బు వెంట మనిషి ఉరుకులు పరుగులు పెడుతున్నంత కాలం మనశ్శాంతి ఉండదు అని చెప్పే కధ. వర్తమాన జీవితం లో సెల్ ఫోన్ మనిషిని ఎంత అల్లకల్లోలానికి గురిచేస్తుందో ఎన్నం ఉపేందర్ 'నెట్ వర్క్ ఫెయిల్యూర్ ' కధలో చక్కగా చిత్రించినారు.నాగరికులమని చెప్పుకునే వారికంటే గ్రామీణ పేదల ఆలోచనే మానవీయం గా ఉంటుందని. మనశ్శాంతినిస్తుందని చెప్పిన కధ సత్యాజి రాసిన 'ఆనందమే జీవిత మకరందం'ఎదుట వారికీ సహాయం చెయ్యడంలో తృప్తి ఉందని 'జీవనవేదం'కధలో మంచికంటి అందంగా చెప్పినారు. ఉత్తమమైన ఈ కధలను పాటకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
                                                                                ........ఎలికట్టె శంకర్ రావు 



ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 134

ధర : రూ 80/-


తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates
    

Friday, March 15, 2013

చినరావూరులోని గయ్యాళులు



Sunday, March 10, 2013

చరిత్రకు సజీవ సాక్ష్యాలు నాణాలు


చరిత్రకు సజీవ సాక్ష్యాలు 
నాణాలు       




 ఈ పుస్తకం నాణాల విజ్ఞాన ప్రియులైన హై స్కూల్ స్థాయి పిల్లలను , సాధారణ నాణాల సేకరణ కర్తలను దృష్టిలో పెట్టుకొని, వారు సంపూర్ణ నాణేల పరిజ్ఞానాన్ని పొందవలేననేడి ద్యేయం తో వ్రాయబడినది . అందువల్లనే ఈ పుస్తక రచన లో నూతన పరిశోదనా ఫలితాలను పొందుపరచడమే గాక నాణాల గ్రంధాలు వ్రాసిన ప్రామాణిక గ్రంధాలను సంప్రదించడమే గాక వారి అమూల్య అభిప్రాయాలను సేకరించడం జరిగింది.

        నాణాలు గడిచిన కాలానికి ఎంతో అమూల్యమైన అదారాలు. నాణాల మీదున్న చిహ్నాలు నటి సాంగీక, మత పరిస్థితులను తెలుపుతాయి . కొన్నిసార్లు ఆయా రాజుల గుణగణాలు , కళాభినివేశం మొదలైయిన అంశాలను కుడా పట్టిస్తాయి. తయారీలో వాడిన లోహాల నాణ్యత నటి ఆర్ధిక పరిస్థితులను అవగతం చేస్తుంది . అరిగిపోయిన , రూపుమాసిన వీటిని కదిలిస్తే కమ్మని కధలు వెదజల్లుతాయి .   

        నాణాల సేకరణ హాబిగా గల వారి ఎంతో ఉపయోగం గా ఉంటుంది. 



ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 218
ధర : రూ 150/-


తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

Friday, March 1, 2013

పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం

పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం ....రంగనాయకమ్మ



                  పిల్లలకు సైన్స్ విషయాలు కూడా అందుతూ ఉండాలి . సైన్స్ అంటే, మనం నివసించే ప్రకృతి గురించి, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం .
             
                  ప్రకృతి విషయాల్లో , ప్రతి సైన్స్ ని నేర్చుకొనక్కరలేదు. వైద్య శాస్త్రం ప్రతి మనిషికి క్షుణ్ణంగా అక్కరలేదు . రోజువారీగా పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు తెలిస్తే చాలు . అనారోగ్యాలు మీద పడ్డప్పుడు , వాటి సంగతి వైద్యులు చూసుకుంటారు. వైద్యులకు తెలిసినంత శాస్త్రం , ప్రతి మనిషికి అక్కర లేదు . ఇతర ప్రకృతి శాస్త్రాల సంగతి కూడా అంతే .

                  కానీ, మనం జీవించే సమాజం గురించి చెప్పే శాస్త్రం సంగతి అలా కాదు . మనం మనుషులం ; జంతువులం కాదు. జంతువులైతే పుట్టినవి పుట్టినట్టే జీవించి మరణిస్తాయి . వాటికీ ఏ శాస్త్రాలు , ఏ జ్ఞానాలు , అక్కర లేదు . కానీ , మనుషులకు , మనుషుల సంబంధాల గురించి తెలియాలి . 
ఆర్ధిక శాస్త్రమే , మనుషుల సంబంధాల్ని , వారి జీవిత విధానాల్ని , వివరిస్తుంది .
 ఈ శాస్త్రమే , నిన్నటి - ఇవ్వాల్టి - రేపటి జీవితాల్ని చూపిస్తుంది .

                ఇది ప్రతి మనిషి కి తెలిసి ఉండాలి .  




ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 381

ధర : రూ 100/-


తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని మార్చిన , మీరు  నచ్చిన, మెచ్చిన   పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates





ఆ నేల, ఆ నీరు, ఆ గాలి

ఆ నేల, ఆ నీరు, ఆ గాలి 



ఎటొచ్చి రెండు విషయాలలో మాత్రం రంగనాధం మాములు రంగానాధమే . మొదటిది బజారులో ఏం చెత్త తినోచ్చిన రాత్రికి ఇంటికి రాంగానే ఇంత ఆవకాయ అన్నమో, గోంగూర అన్నమో దబదబ తినేస్తాడు . ఎవళ్ళో చూస్తారేమో అన్నట్లు . రెండోది , ఇంకా ఇంగ్లీష్ తెలుగులానే మాట్లాడతాడు . పుస్తకంలో పేరాగ్రాఫుల్లా .....
                                                                                                               - మెటా మార్ఫిసిస్ కద


" ఆ అమ్మాయి ఎమ్. ఏ ఎందులో చేసిందో నాకనవసరం . బంగారు బొమ్మ అయితేనేం ? రాతి విగ్రహం అయితేనేం ? ఆవిడ చేస్తున్న ఉద్యోగం సోషల్ వర్కర్ ఉద్యోగం . ఇకపోతే సంగీతం లో ఎంత పాండిత్యం ఉన్న అమ్మాయి అయినా అమెరికా వచ్చి ఏం చేస్తుంది చెప్పు ? ఇంట్లో కూర్చుని త్యాగరాజ కృతులు పాడుకుంటుందా ? సోషల్ వర్కర్ , సంగీత విద్వాంసులు ఎక్కడ మాత్రం ఎవరిక్కావాలి ?"

                                                                                                                - తీన్ కన్యా కధ


వేలూరి కధలు అమెరికా తెలుగువాళ్ళ వ్యవహారశైలి పై సుతిమెత్తగా చురకలంటించిన వ్యంగ కధలు . కధని నిర్మించడంలో , నడిపించటంలో ఆయనొక ప్రత్యేక పద్ధతి ఉంది . అది అమెరికాలోని ఇతర తెలుగు రచయితల శైలికి భిన్నమైనది . హాస్య, వ్యంగ్య ధోరణిలో కధలు నడిపించినా , వాటిల్లో ఆవేదన, ఆవేశము ఉన్నాయి . అవి పాటకులను అలరిస్తూనే ఆలోచింపచేస్తాయి . ఇది వేలూరి వారి ప్రత్యేకత .
                                                                                                                  - వాసిరెడ్డి నవీన్



ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 190

ధర : రూ 100/-


తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates