Friday, December 27, 2013

వావిలాల గోపాలకృష్ణయ్య -ఆలోచనలు ,ఆదర్శాలు

Buy Vavilala Gopala Krishnaiah online - online Telugu Books

రియాలిటీ చెక్ - పూడూరి రాజిరెడ్డి

Buy Reality Check online - online Telugu Books

రియాలిటీ చెక్ - పూడూరి రాజిరెడ్డి

Buy Reality Check online - online Telugu Books

ఆస్కార్ అవార్డులు తెర వెనుక సూత్రధారులు

Buy Oscar Avardlu online - online Telugu Books

ఆధ్యాత్మిక విజయ సూత్రాలు -ఎ.ఆర్.కె. శర్మ

Buy Adhyatimka Vijaya Sutralu online - online Telugu Books

స్మృతి పరిధిని అధిగమించి ఆలోచించడం -ఎ.ఆర్.కె. శర్మ

Buy Smruthi Paridhini Adhigaminchi Alochinchadam online - online Telugu Books

Tuesday, September 3, 2013

కులం - కత్తి పద్మారావు

Kulam - online Telugu Book Store

చంద్రుడు - చిల్లిగవ్వలు - సోమర్ సెట్ మామ్

Chandrudu Chilli Gavvalu - online Telugu Book Store

అక్షరార్చన - లంకా శివరామ ప్రసాద్

Akshararchana - online Telugu Book Store

రహస్య భారత దేశంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ - పాల్ బ్రంటన్

Rahasya Bharatham lo Naa Adhyathmika Anveshana - online Telugu Book Store

విలియం షేక్స్పియర్ - అంటోనీ క్లియోపాత్ర

Antony Cleopatra - online Telugu Book Store

శ్రీ గాయత్రీ ఆరాధన

Sri Gayathri Aradhana - online Telugu Book Store

భారతీయ ప్రతిభా విశేషాలు 108 నిజాలు

Bharatheya Prathibaa Visheshalu 108 Nijalu - online Telugu Book Store

Wednesday, June 5, 2013

కాశీఖండము

                క్రమముక్తిని కలిగించే మార్గములలో నియమపూరితమైన క్షేత్రవాసమొకటి. క్షేత్రము యొక్క మహాత్త్వాము వలన సాధన త్వరితగతిన ఫలితమీయగలదు. ఉత్తర వాహిని గంగ ప్రవహించే విశ్వనాధుని కాశీ మహాక్షేత్రం, చరిత్ర కందని కాలం నుండి భారతదేశపు ఆద్యాత్మిక రాజధాని-కాశీలో కొలది కాలమైన ఆవాసము చేయవలేనన్నది సగటు భారతీయ ఆస్తికుని ఆకాంక్ష. కాశీలోని ప్రతి అంగుళము మహామహిమోపేతమైన పుణ్యస్థలము.
                   కాశీక్షేత్రమహాత్త్యమును వర్ణించిన పురాణములలో స్కాందము ముఖ్యమైనది. ఇందున్న కాశీఖండము కాశీనగర చరిత్ర, కాశీలోని వివిధ పున్యప్రదేశములను వివరించుచున్నది. క్షేత్రమును దర్శింపదలచినవారు ఆ క్షేత్రపు మహత్త్యము, దర్శనీయ ప్రదేశములు, వాటి చరిత్ర, ఆ క్షేత్రములలో చేయదగిన లేక చేయకూడని పనులు తెలుసుకొనుట అత్యంత ఆవశ్యకము.సంస్కృతాంద్రోపన్యసకులుగా పదవీ విరమణ చేసి దర్మప్రచారంలో ఇతోధికమైన సేవ చేస్తున్న శ్రీ మల్లాది శ్రీహరిశాస్త్రి గారు కాశీవాసులుగా ఉండే తెలుగు వారి కోసం, కాశీ ఖండమును స్వేచ్చానువాదం చేసి దానితోపాటు యాత్రికులకు అవసరమైన యాత్రాదర్శనిని, కాశీక్షేత్రమునకు సంబందించిన ముఖ్య స్తోత్రములను చేర్చి ఒక గ్రంధంగా తీసుకుని రావడం ఎంతో అనందం కలిగించింది. తెలుగు ఆస్తికులకు ఇది ఎంతో ఉపకారము కాగలదు.
                                                                .....శ్రీ కంచికామ పీఠాదిపతులు, శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి 

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates

Sunday, May 26, 2013

నీ సహజ స్థితిలో ఉండు

నీ సహజ స్థితిలో ఉండు

              భగవాన్ శ్రీ రమణ మహర్షి మౌనస్వాములుగా, దక్షిణామూర్తి అవతారంగా ప్రసిద్ధులు. అంటే వారి భోదన అధికభాగం మౌనం ద్వారానే జరిగేదన్న మాట. అయినా, సాధకుల సందేహాలను వారు వాక్కు ద్వారా కూడా నివృత్తి చేసేవారు. వారు అరుణాచలంలో గడిపిన అర్ధశతాబ్ది కాలంలో ఎందరో సాధకులు వారిని సందర్శించి వివిధ విషయాల గురించి తమ సందేహాలను నివృతి చేసుకునే వారు. ఆత్మవిచారం, శరణాగతి, యోగం, సత్సంగం, గురువు, సమాధి, భగవంతుడు, పునర్జన్మ, సృష్టి - ఇటువంటివే మరెన్నో విషయాల గురించి శ్రీ మహర్షి చెప్పిన సమాధానాలు విషయక్రమంలో ఈ పుస్తకంలో దొరుకుతాయి.

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 242
ధర : రూ 150/-

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates

Saturday, May 25, 2013

నాగా రహస్యం

వేట కొనసాగుతోంది. ఒక దుర్మార్గుడైన నాగా తన ప్రాణ మిత్రుడైన బృహస్పతిని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు తన భార్య సతీని వెంటాడుతున్నాడు. చెడుని నిర్మూలించడానికి అవతరించినట్టుగా భవిష్యవాణి చెప్పబడిన టిబెట్ వలసదారు శివ ఎక్కడికక్కడ దుష్ట స్వభావాన్ని ప్రతిఘటించి గానీ నిద్రపోడు. శివ ప్రతీకార పధంలో పయనించే సందర్భంలో సరిగ్గా తను అనుకున్నట్టే నాగా ప్రాంతాన్ని చేరుకుంటాడు.

         మోసం, కపటం లేనిదెక్కడ? అన్నిచోట్లా ఉంది. ఒక అద్బుతమైన ఔషధానికి ప్రతిఫలంగా చెల్లించవలసిన మూల్యం కోసం ఒక రాజ్యం రాజ్యమే అంతమైపోవడానికి సిద్దంగా ఉంది. యువరాజు హతమయ్యాడు. ఆద్యాత్మిక మార్గదర్శకులైన వసుదేవులు చెడుని సహాయంగా తీసుకుంటూ, తమపై తిరుగులేని నమ్మకం కలిగి ఉన్న శివని మోసం చేశారు. మెలుహ రాజ్య పరిపూర్ణత కూడా జనన ప్రాంతమైన మైకాలో దాగిన భయంకరమైన రహస్యాలతో పెద్ద చుక్కుముడిలా తయారైంది. శివకి తెలియకుండా, మహా మేధావి ఎవరో వెనకాల ఉండి, ఈ తోలు బొమ్మలాటకి దర్శకత్వం వహిస్తున్నారు.

         ఈ ప్రయాణంలో శివ ప్రాచీన అఖండ భారతావని అంతా పర్యటించాడు. అడుగడుగునా ప్రాణాంతకమైన మర్మాలు దాగిన ప్రాంతంలో శివ సత్యాన్వేషణ జరుపుతున్నాడు. అన్ని చోట్లా తనకు అర్ధమైన గొప్ప సత్యం ఒకటే.... కనిపించే ప్రతీది అలా మాత్రమే ఉండదు.....! భయంకరమైన యుద్దాలు జరిగాయి. ఆశ్చర్యకరమైన రీతిలో సంధి బలపడింది.
శివ త్రయంలోని మొదటి భాగమైతే ఆ తర్వాత వెలువడుతున్న 
ఈ రెండవ భాగంలో నమ్మలేని రహస్యాలు అనేకం బహిర్గతమవుతాయి.

తెలుగు పుస్తకాల కోసం 
www.logili.com

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates
http://www.facebook.com/logilidotcom

Sunday, April 28, 2013

అష్టవిధ శృంగార నాయికలు

               శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్రేసర రంగస్థల నటులు. ఎంతటి నటులో అంతటి విద్వాంసులు. ప్రాచీన కావ్య పరిజ్ఞానం కలవారు. అంతేకాక ఇప్పుడు ఈ " అష్టవిధ శృంగార నాయికలు" కృతి ద్వారా ఒక ప్రౌడ కవిగా మరోసారి సాహితీ జగత్తులో సాక్షాత్కరిస్తున్నారు.

               అవస్థా భేదాలను బట్టి శృంగార రసంలో అష్టవిధ నాయికలుంటారు. భర్త పరస్త్రీ కాంక్షారహితుడై తనపైనే ప్రగాడమైన అనురాగంతో తనకు అధీనుడై వున్న నాయిక 'స్వాధీన పతిక'. తన ప్రియుడు వచ్చే సమయానికి ఇంటిని, గదిని, తననూ అలంకరించుకొని నిలిచేది 'వాసక సజ్జిక'. విభుడు పరకాంతలోలుడై రాత్రంతా గడిపి, తెల్లవారుజామున తన ఇంటికి రాగా ఈసడించి కసరి కొట్టేది 'ఖండిత'. ఆ తరువాత పశ్చాతాప అయ్యేది 'కలహాంతరిత'. ప్రియుని రాక కోసం ఉత్కంటతో ఉండేది 'విరహోత్కంటిత'. పరదేశాగతుడైన ప్రియుని విరహంలో కృషించేది 'ప్రోషిత భార్త్రుక'. మరి మదనపీడితయై, ప్రియుణ్ణి అన్వేషిస్తూ పోయేది 'అభిసారిక'. సంకేత స్థలానికి వెళ్లి ప్రియుడు కనిపించక ఆర్త అయ్యేది 'విప్రలబ్ద'.

             అభిసారిక ప్రియునికై సంకేత స్థలానికి పోతు పొందే మానసిక మధనాన్ని ఇలా అక్షర రూపంలో మన ముందుంచుతారు శాస్త్రి గారు ....  
             "అతని గన పొంగు వయసుల అణచుతటేట్లు 
              అతని గనకున్న తమి పొంగులడగుటెట్లు 
              చెలునికై చను నా సిగ్గు చితక దింత 
              ఎంత తెంపరినైతి నే నింత తెగువ ?"

                                                                                .... సి నా రె 

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates

Saturday, April 27, 2013

పాకుడు రాళ్లు

పాకుడు రాళ్లు 

సరిక్రొత్త ప్రచురణ  ఈ రోజే మార్కెట్లో విడుదల

సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రభావంతంగా బొమ్మకట్టించిన తోలి తెలుగు నవల.
        మద్రాసులో ముడున్నరేళ్ళు 'చిత్రసీమ' సినిమా పత్రికలో పనిచేస్తూ సినిమా తారల భేటీలెన్నో దిద్దాను. రిపోర్టర్లతో ఉన్న సాహిత్యంతో వారి ద్వారా తెలుసుకున్న వివరాలు నేను స్వయంగా తెలుసుకున్నవి గుదిగుచ్చి ఒక కధ రాశాను. మంచి స్పందన రావడంతో 'మాయాజలతారు' నవలను రాశాను. దీనికే పాకుడు రాళ్లు పేరు మార్చారు శీలా వీర్రాజు. నాకు ఇష్టమైన నవల ఇది. రాజకీయం,సినిమా మహా సముద్రం లాంటివి. ఎంతరాసిన తక్కువే.
                                                                              ...... రావూరి భరద్వాజ 
                                              
రావూరి భరద్వాజకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం 2013 కు గాను  లభించింది. చిత్ర పరిశ్రమలో వ్యక్తుల అంతరంగాలను అద్భుతంగా అవిష్కరించిన 'పాకుడురాళ్లు 'నవలకు ఈ పురస్కారం దక్కింది. ఈ పురస్కారం వరించిన తెలుగు వారిలో ఆయన మూడో వ్యక్తి. తొలిసారిగా 1970లో విశ్వనాథ సత్యనారాయణ 'రామాయణ మహావృక్షం' రచనకు దక్కిన ఈ పురస్కారం.. తర్వాత 1988లో 'విశ్వంభర' రచనకు గానూ సి.నారాయణరెడ్డిని వరించింది. ఆ తర్వాత సరిగ్గా పాతికేళ్ల అనంతరం జ్ఞాన్ పీఠ్ పురస్కారం మరోసారి తెలుగు రచయిత తలుపు తట్టింది.

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 506
ధర : రూ 290/-

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates

Monday, April 22, 2013

ది పవర్ అఫ్ పాజిటివ్ థింకింగ్

ఇంటర్ నేషనల్ బెస్ట్ సెల్లర్  
                 ప్రపంచ ప్రసిద్ది పొందిన The Power of Positive Thinking పుస్తకమును 'సానుకూల ఆలోచన శక్తి' గా తెలుగులోకి తీసుకువచ్చారు.  
        
         లక్షలాది స్త్రీ పురుషులు వాళ్ళ జీవితాలను విజయవంతం చేసుకోవడానికి సహాయపడింది ది పవర్ అఫ్ పాజిటివ్ థింకింగ్. అనూహ్యమైన అమ్మకాలు సాధించిన ఇందులో డాక్టర్ పీల్ ఆచరణలో విశ్వాసం యొక్క  శక్తిని నిరూపిస్తారు. ఈ పుస్తకంలో వివరించిన ఆచరణీయ కిటుకులతో మీరు మీ జీవితంలో బలం పుంజుకోవచ్చు. పైగా మీ కోరికలను, ఆశలను నేరవేర్చుకోవటానికి అవసరమైన ఉపదేశాన్ని పొందవచ్చు. మీరు నేర్చుకోనేవి :
. మీ మీద ,మీరు చేసే ప్రతిదాని మీద నమ్మకం పెంచుకుంటారు.
. గొప్ప శక్తిని, పట్టుదలని పెంచుకుంటారు.
. మీ లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన శక్తి పెంచుకుంటారు
. చింతపడే లక్షణాన్ని పోగొట్టుకుని విశ్రాంతికరమైన జీవనాన్ని సాధిస్తారు.
. మీ వ్యక్తిగత, వృత్తిపర సంబంధ బాందవ్యాలని మేరుగుపరుచుకుంటారు.
. మీ పరిస్థితుల మీద అధికారం పొందుతారు.
. మీ మీద మీరు దయగా ఉంటారు. 

     పాఠకుడు ఆనందమైన, తృప్తికరమైన,ప్రయోజనకరమైన జీవితాన్ని సాధించడానికి తోడ్పడాలన్న ఏకైక లక్ష్యంతో రాయబడింది ఈ పుస్తకం.

                                                                             ....... నార్మన్ విన్సెంట్ పీల్ 

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates

Thursday, April 18, 2013