Tuesday, July 16, 2013

ఆంధ్రనగరి

Andhra Nagari - online Telugu Book Store

2 comments:

  1. Book Release:

    ĀNDHRANAGARI
    Song of the Black River

    A Breath of Fresh Air to the Historical Fiction Writing in Telugu

    Worldwide, historical fiction has been a very popular literary genre. The width and the size of English readership and the financial returns for a successful work of fiction allow the writers to undertake extensive and thorough investigation of background. Vernacular markets do not provide adequate rewards to justify such time and money consuming research. Understandably, it is rare to find a novel, written in a vernacular that is based on in depth understanding of the historical setting. In this background, Sai Papineni’s Āndhranagari – Song of the Black River comes as a breath of fresh air.
    The book, based on the Andhra Empire that had flourished in the early historical times from the third century BCE to its gradual decline in the seventh century CE, was launched yesterday symbolically at the feet of the gigantic statue of Buddha surrounded by the waters of Hussain Sagar in Hyderabad. Mr. Maganti Rajendra Prasad, Chairman of the Soma Group had unveiled the volume in front of a gathering of prominent citizens, litterateurs and media. He said, “The book is a result of exhaustive research, an effort rare in these days. It’s a laudable undertaking by Mr. Sai Papineni to spread the awareness of the glorious past of our people through this popular literary medium. I felt compelled to support such a noble cause. I wish him success and I am sure that Āndhranagari would create a feeling of pride in our cultural past among millions of Telugu people.”
    The pivot of the novel is the gradual dismembering of Amaravati Stupa in the hands of antiquarians, amateur archaeologists and civil servants since its discovery by the modern man in late eighteenth century. Their attitudes and actions leading to the transfer of this art treasure to various museums around the world – and incidentally creating a greater awareness of the Amaravati School of Sculpture in the western world – leaving a desolate mound at the site as a reminder of what had been a glorious metropolis that had flourished for a millennium. The author travels in time narrating the story of the civilization of the Krishna River – its inception, glory and the inevitable decline – through the lives of a profusion of characters that come alive from the depths of time. The geographical canvas of the narrative is vast, straddling the internecine politics of the Flavian emperors of Rome, the struggles of the nascent empire of Tang China and the mercantile emporia of the Indian Ocean, but never deviating from the story line that portrays the Andhra Civilization in all its glory. The novel is a ‘must read’ even to those who have no serious interest in history, for the simple style and the joie de vivre of the characters.
    The novel is published by Arts & Letters and distributed by Visaalandhra Publishing House which has a wide footprint in the state. Speaking to the gathering, Mr. C. Anjaneya Reddy, president of the publishing house, known for promoting books on the ancient Indian culture, said, “The early historical period is the most seminal phase and its influence is felt even today on the ideas and practices of the people of Andhra Pradesh. It was a global society inspiring the civilizations of a vast swathe of land from Europe to the Far East. Arts and Letters, Hyderabad is proud to present this book that brings alive this truly golden age from the annals of our past.”
    Dr. Ketu Viswanatha Reddy, renowned Telugu writer and educationist spoke during the occasion and said, “From the point of view of the language, Sai Papineni’s writing is aptly suited to enliven the plot and characters in a historical background. His style is modern, a seamless mix of simplicity of words and the profoundness of ideas.”
    The novel is available in all the prominent book stores in Andhra Pradesh. The deluxe edition is priced at Rs. 500 and a soft-cover version will also be available soon.








    ReplyDelete
  2. పుస్తకావిష్కరణ:
    జూన్ 18, 2013
    ఆంధ్రనగరి
    Song of the Black River

    తెలుగు సాహితీవనంలో ఒక తొలకరి జల్లు

    ప్రస్తుతం ప్రపంచమంతా చారిత్రక నవలా సాహిత్యానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. ఇంగ్లీష్ కాల్పనిక సాహిత్యానికి ఉన్న విస్తారమైన అదరణ వల్ల విజయవంతమైన రచయితలకి ఆర్థిక లబ్ధి కలుగుతుంది. అందువలన చారిత్రక నేపధ్యంపై విస్తృతమైన పరిశోధన జరపటం వాళ్ళకు సాధ్యమయింది. కానీ ప్రాంతీయ భాషా సాహిత్యానికి ఉన్న పరిమితమైన ఆదరణ దృష్ట్యా, ఎంతో ఖర్చుపెట్టి లోతుగా పరిశోధించటం అంత సులువైన పని కాదు. ప్రాంతీయ భాషలలో చారిత్రక నేపధ్యంతో పూర్తి అవగాహనగల రచనలు అంత తరచుగా రాకపోవటానికి ఇదే ముఖ్య కారణం. ఈ నేపధ్యంలో సాయి పాపినేని గారి ఆంధ్రనగరి మన తెలుగు సాహితీవనంలో ఓ తొలకరి జల్లు.
    క్రీ.పూ. మూడవ శతాబ్దిలో వేళ్ళూని వెయ్యేళ్ళపాటు మహోజ్వలంగా సాగిన మహాంధ్ర సామ్రాజ్యచరిత్రకి అద్దంపట్టిన ఈ నవల, నిన్న హుస్సేన్‌సాగర్ నడిబొడ్డున బుద్ధవిగ్రహంవద్ద అవిష్కరించబడింది. ప్రముఖులు, సాహితీవేత్తలు, పాత్రికేయుల సమక్షంలో, సోమా గ్రూప్ అధినేత, శ్రీ మాగంటి రాజేంద్రప్రసాద్‌గారి చేతులమీదుగా, ఈ కార్యక్రమం జరిగింది. రాజేంద్రప్రసాద్‌గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, "శ్రీ సాయి పాపినేనిగారు ఈ నవల గురించి ఎంతో లోతైన పరిశోధనచేసి దాని రచనని ఒక మహాయజ్ఞంగా నిర్వహించారు. ప్రాచీనాంధ్ర సంస్కృతిని మనవాళ్ళకి పరిచయం చేయాలనే ఆయన ఉద్దేశ్యం మంచిది. అదే వారి ప్రయత్నానికి కావలసిన సహకారం అందిచడానికి నన్ను ప్రేరేపించింది. వారి ఈ ప్రయత్నం సఫలమవ్వాలనీ, ఈ ఆంధ్రనగరి పుస్తకం లక్షలాది తెలుగువారిలో మన సంస్కృతిపట్ల అవగాహననీ, గౌరవాన్నీ పెంపొందించాలనీ ఆశిస్తున్నాను", అన్నారు.
    క్రీ.శ. 18వ శతాబ్దాంతంలో, అమరావతి స్తూపాన్ని కనుగొన్నప్పటినుండీ, అది పురాతన వస్తు సంగ్రహకులూ, పురాతత్వవేత్తలూ, ప్రభుత్వోద్యోగుల చేతుల్లోపడి ఈనాటికి నామమాత్రంగా మిగిలింది, అప్పటి వారి అనాలోచిత నిర్ణయాలవల్ల అమరావతి శిల్పసంపద అనేక మ్యూజియమ్‌లకి చేరి ప్రపంచపు నలుమూలలా ఖ్యాతిగాంచినా, మన తెలుగువాళ్ళకి మాత్రం దూరమయింది. వెయ్యేళ్ళు మన ఆంధ్రుల రాజధానిగా వైభవం కనుజూచిన ఈ మహానగరం, నేడొక మట్టి గుట్టగా మిగిలింది. రచయిత తన మనోనేత్రంతో ఆకాలానికివెళ్ళి, కృష్ణా నదీమతల్లి ఒడిలో వెలిసిన ఈ అపూర్వ నాగరికతయొక్క ఉత్థానపతనాలని, తన పాత్రలతో, కథనంతో పునరుజ్జీవింపజేసి కనులకు కట్టినట్లు మన ముందుంచాడు. అటు రోమన్ సామ్రాజ్యంనుండి, ఇటు చైనా వరకూ జరిగిన, సమకాలీన ప్రపంచ రాజకీయ, వాణిజ్యపరమైన ఘట్టాలని ముడివేస్తూ, ముఖ్యోద్దేశానికి ఏమాత్రం భంగం కలిగించకుండా కథ మలచబడింది. ఈ నవల యొక్క సరళమైన శైలీ, జీవం ఉట్టిపడే పాత్రలు, చరిత్రపట్ల మక్కువ కలిగిన ఏ కొద్దిమందికి మాత్రమేగాక చదివిన ప్రతి తెలుగువానికీ సంతృప్తినిస్తాయి.
    ఈ నవల ఆర్ట్స్ & లెటర్స్, హైదరాబాద్ వారిచే ప్రచురించబడి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారిచే పంపిణీ చేయబడుతుంది. ప్రాచీన చరిత్రపై ఎన్నో పుస్తకాలను ప్రచురించి మనకందించిన ఆర్ట్స్ & లెటర్స్ సంస్థ అధ్యక్షులు శ్రీ చెన్నూరు ఆంజనేయరెడ్డిగారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఆంధ్రుల చరిత్రలో ప్రాచీన చారిత్రక యుగం ఎంతో ప్రాముఖ్యం సంతరించుకొంది. ఈనాటి ప్రజల జీవనంపైనా, ఆలోచనావిధానంపైనా ఆనాటి ప్రభావం ఎంతో ఉంది. అప్పటి సంఘంలో సర్వమానవాళితో స్నేహ సద్భావనలను వెల్లివిరిసాయి. మన ఆంధ్రదేశం ప్రపంచపు నలుమూలలకీ నాగరికతని పంచింది. మనచరిత్రలోని ఈ స్వర్ణయుగాన్ని మీముందుంచే ఈ నవలని అందించటానికి ఆర్ట్స్ & లెటర్స్, హైదరాబాద్ సంస్థ ఎంతో గర్విస్తుంది", అన్నారు.
    ప్రఖ్యాత తెలుగు రచయిత, విద్యావేత్త, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిగారు ఆహూతులతో మాట్లాడుతూ, "భాషాపరంగా చూస్తే సాయి పాపినేనిగారిది చారిత్రక ఇతివృత్తానికి, నేపథ్య నిర్వహణకు పాత్రల చిత్రణకూ అనుగుణమైన రచన. సారళ్యము, ప్రసన్నత, గాంభీర్యము తగుపాళ్ళలో మేళవించిన ఆధునిక శైలి", అని రచయితని ప్రశంసించారు.
    ఈ నవల ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలలో దొరుకుతుంది. డీలక్స్ ఎడిషన్ ధర రూ. 500. పేపర్ బ్యాక్ ప్రతులు త్వరలో విడుదల కానున్నవి.

    ReplyDelete