Saturday, April 6, 2013

ఒక మనిషి... ఒక ఇల్లు..... ఒక ప్రపంచం........



                                                                                                                       ........... మిసిమి ఏప్రిల్ 2013


ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates



Thursday, April 4, 2013

రాళ్ళూ కరిగే వేళ

రాళ్ళూ కరిగే వేళ 
                            ..... పి. లంకేశ్

అకాడమీ పురస్కారం పొందిన కన్నడ కధా సంకలనం 

16  కధల  ఉత్తమ  సంకలనం


 ఈ కధలు కన్నడ అత్యుతమ రచయితల్లో ఒకరైన  శ్రీ పి.లంకేశ్. అయన కధలు నేల  విడిచి సాము చేయవు . వారి కధల్లోని పాత్రలు అత్యంత సహజంగా ప్రవర్తిస్తాయి . జీవితంలోని కటినమైన వాస్తవాలను, చేదు నిజాలను , బాధలను, అంతులేని  దుఃఖాలను,పగలతో రగిలే క్రూరమైన మనుష్యులను, మనిషిలోని పశుత్వాన్ని, అనుచుకున్న కోరికలను, సమాజాన్ని పట్టి పీడించే అంటరానితనాన్ని, మనిషి అంతరంగంలో దాగిన నీచత్వాన్ని - ఇలా ఒకటేమిటి, సమాజపు బహుముఖాలను ప్రతిభావంతంగా ఈ కధల్లో లంకేశ్ చిత్రించరు.

                 ఈ కధా సంకలనంలోని కధలలోని తీవ్రత పైకి కనిపించకపోయినా ఈ కధల లోతుల్లో కళ్లారా చూసిన, అనుభవించిన విచిత్రమైన బాధలు, జీవించే యాంత్రికతలో పోగొట్టుకుని పోయే సంభంధాల పట్ల సుక్ష్మ వేదన ఈ కధల్లో ఉన్నాయి.




ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

పల్నాటి వీరచరిత్ర

పల్నాటి వీరచరిత్ర



పల్నాటి వీరచరిత్రను మంజరీ ద్విపదలో వ్రాసిన కవులు ముగ్గురు. అందులో బాలచంద్రుని యుద్దభాగాన్ని శ్రీనాధుడు వ్రాయగా, తక్కిన భాగాలు కొండయ్య,మల్లయ్య పేరిట ఉన్నాయి. ఈ కధ జరిగి 850(క్రీ.శ.1160 లో పలనాటి యుద్ధం జరిగింది.) సంవత్సరాలు కావస్తున్నా,ఇది జానపదులకు చేరువైనంతగా, చాలాకాలంగా విద్యావంతులకు చేరువ కాలేదు. ఆ చేరువయ్యే పనిని శ్రీ నాధులు కొంత చేసారు. కానీ ఈ నాటి వరకు ఆ కధ యొక్క ఆనుపానులు అమూలగ్రంగా తెలిసిన వారు చదువరులలో తక్కువే. ఎందుకంటే, ఇది కవితా రూపంలో ఉండడమే అందుకు కారణం. మంజరి ద్విపదలో సులభశైలి నడిచినప్పటికీ, ఆ వృత్తాంతాన్ని తెలిసికోనదగిన వారి కేందరికో అది ఇంకా అందకుండానే ఉండిపోయింది. ఆ గాధ సర్వజనులకు తెలిసేటట్లుగా వచన రూపంలో సమగ్రసుందరంగా రచించి, తెలుగు ప్రజల కందించిన ఘనత ఇంతకాలానికి బాలగంగాధరరావు గారికి దక్కింది. రావు గారి శైలి సరళ సుందరంగా ఉంది. అందరకు అర్ధమవుతుంది. పుస్తకాన్ని చదివిస్తుంది. రక్తి గొలుపుతుంది. విరామం లేకుండా చదవాలనే ఉత్కంఠ కలిగిస్తుంది.
                                                                        ........ ఆచార్య వి.రామచంద్ర చౌదరి  




ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 

ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates



Wednesday, April 3, 2013

గోనెసంచి అబ్బాయి

గోనెసంచి అబ్బాయి



ఎవరీ గోనె సంచి అబ్బాయి ? ఎక్కడినుంచి వచ్చాడు ?
వాళ్ళ ఉళ్లో ఉన్న ఒక పిచ్చివాడి గురించి తెలుసుకోవడానికి
 ఆరాటపడిన అనూకి అనుకోని స్నేహం దొరికింది .
తన జీవితం గురించిన కొత్త అవగాహన కూడా......

               డిఫరెంట్ టేల్స్ ప్రాజెక్ట్ వివిధ ప్రాంతీయ కధల్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం . పిల్లల సాహిత్యంలో ఎన్నడూ భాగం కాలేకపోయిన ఎంతో మంది పిల్లల జీవితాలు, వారి కుటుంబాలు మనకీ కధల్లో కనిపిస్తాయి . చాల కధలు రచయతలు తమ సొంత బాల్యాన్ని ఆధారంగా చేసుకొని రాసినవి. అందుకనే మనకు వివిధ ప్రాంతాల, కులాల ప్రజలు మాట్లాడే తెలుగు వీటిలో వినిపిస్తుంది. ఈ కధలు కల్లోలపూరితమైన ప్రపంచంలో పెరుగుతున్న పిల్లలు తమ స్నేహితులతో, తల్లితండ్రులతో, చుట్టరికం లేని ఇతర వ్యక్తులతో కొత్త పరిచయాలు, సంభంధాలు ఎ విధంగా ఎర్పరుచుకుంటారో మనకు తెలియచేస్తాయి. నోరూరించే వంటకాలు, ఆసక్తికరమైన ఆటలు, ఆసక్తిలేని పాటాలు, హృదయాన్ని కదిలించే స్నేహాలతో నిండిన ఈ కధలు మనల్ని పరిచయం లేని కొత్త ప్రపంచాల్లోకి ఆహ్వానిస్తాయి. ఈ కధలు తొమ్మిది సంవత్సరాలపై వయస్సున్న పిల్లలు చదివి అర్ధం చేసుకోగలరని మా నమ్మకం.


ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates
http://www.facebook.com/logilidotcom 

Tuesday, April 2, 2013

వన్ మినిట్ మేనేజర్


రెండు దశాబ్దాలుగా బెస్ట్ సేల్లెర్గ గుర్తింపును కొనసాగిస్తున్న రచన

"వన్  మినిట్ మేనేజర్ "

 ప్రపంచ ప్రసిద్ది పొందిన మేనేజ్ మెంట్  పద్ధతి 
ఇది త్వరితమైనది. ఇది సరళమైనది, ఇది అద్బుతమైనది 
ఒక్క నిమిషాన్ని ఫలవంతంగా వినియోగించుకోవడానికి సంబంధించిన మూడు సరళమైన రహస్యాల్ని ఈ పుస్తకం మీకు సుభోధకం చేస్తుంది. 
మీ వృతిని, జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి 
ఇరవై ఏళ్ళకు పైగా దేశవ్యాప్తంగా ఫార్చ్యున్ 500 కంపెనీలకు, ఇతర చిన్న తరహ వాణిజ్య సంస్థలకు చెందిన లక్షలాది మంది మేనేజర్లు (కార్యనిర్వహనాధికారులు) 'వన్ మినిట్ మేనేజర్ ' మెలుకువల్ని పాటించడం ద్వారా తమ సంస్థల ఉత్పాదకతను, వృతి జీవితలో సంతృప్తిని, వ్యక్తిగత అభివృధి ని పెంపొందించుకు న్నారు. సంస్థకు, దాని ఉద్యోగులకు లాభదాయక పలితాల్ని అందించే ఈ  పద్ధతి లో ని మేనేజ్ మెంట్ మేలుకువల్ని అభ్యసించడం ద్వారానే వాళ్ళు ఇంతటి గొప్ప వాస్తవ ఫలితాల్ని  సాధించారు.

ఈ వన్ మినిట్ మేనేజర్ సంక్షిప్తమైన, సులభతరమైన కధనం తో కొనసాగి మీకు ముఖ్యమైన మూడు రహస్యాల్ని వివరిస్తుంది. ఆవి :
 వన్ మినిట్(ఒక్క నిమిషం లక్ష్యాలు )
వన్ మినిట్ ప్రశంసలు 
వన్ మినిట్ విమర్శలు.

వైద్యం, మనవ ప్రవర్తనా శాస్త్రాలకు సంబంధించి పలు శాస్త్రీయ పరిశోధనల్ని ఈ పుస్తకం ప్రస్తావిస్తుంది. ఇంతటి సరళమైన పద్ధతులు ఎందరో  వ్యక్తులకు  సమర్దవంతం గ సహకరించడంలోని మర్మాన్ని ఆ పరిశోధనలకు మీకు వివరిస్తాయి. పుస్తకాన్ని చదవడం ముగిచేటప్పటికి మీ పరిస్త్తుల్లకు అనుగుణంగా ఆ పదతుల్న్ని పతించదమెలాగొ, వాటి ప్రయోజనాల్ని చెరగొనదమెలాగొ మేకు చక్కగా తెలిసిపోతుంది.

అందుకే రెండు దశాబ్దాలు పైగా వాణిజ్యపరమైన రచనల జాభితాలో వన్ మినిట్ మేనేజర్ బెస్ట్ సెల్లర్ గ తన స్థానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ, ఒక అంతర్జాతీయ సంచలనంగా స్టిర ప్రాచుర్యాన్ని సొంతం చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వేలాది వాణిజ్య సంస్థలకు చెందిన లక్షలాది మంది ఈ వన్ మినిట్ మేనేజర్ ద్వారా ప్రయోజనం పొందారు, పొందుతూనే ఉన్నారు.




ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates



   

Tuesday, March 19, 2013

వేగు చుక్క వెనిజులా

వేగు చుక్క వెనిజులా         


   
                     క్యూబా అధినేత పైడల్ కాస్ట్రో తరువాత వెనిజులా అధ్యక్షుడు చావెజ్ పేరు లాటిన్ అమెరికాలోను మొత్తం ప్రపంచ వ్యాప్తంగాను మార్మోగుతున్నది. దీనికి కారణం అయన కూడా కాస్ట్రో మాదిరిగా అమెరికా సామ్రాజ్యవాదులను నికరంగా నిలబడి ప్రతిఘటించడమే. అందుచేతనే అమెరికా అమెరికా సామ్రాజ్యవాదులు కుట్రపన్ని తమకు అనుకూలమైన ట్రేడ్ యూనియన్ లు ,ప్రతిపక్షాలను రంగంలోకి దింపి 2002 లో చావెజ్ పదవీచ్యుతుని చెసరు. కానీ ప్రజా ఉద్యమాల మద్దతుతో చావెజ్ మళ్ళీ అధ్యక్ష పదవిని చేపట్టారు . ఆ చారిత్రిక ఘట్టం తర్వాత కొద్ది రోజులకే మార్టా ఆయనతో సుదీర్ఘ ఇంటర్వ్యూ జరిపారు . ఆ సంభాషణలకు గ్రంధ రూపమే ఇది . పలు అంశాలపై చావెజ్ తన అభిప్రాయాలను ఈ ఇంటర్వ్యూ లో సూటిగా పేర్కొన్నాడు .

మార్తా హర్నకర్ లాటిన్ అమెరికాలో ఉంటూ ఆ ఖండంలో వామపక్ష ఉద్యమాల గురించి పలు రచనలు చేశారు .



ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates


Monday, March 18, 2013

ప్రపంచం లోని జంతువులు

ప్రపంచం లోని జంతువులు
మొత్తం రంగు రంగుల పేజీలలో , పూర్తిగా తెలుగు లో... మీ కోసం



జంతువుల ప్రపంచం లో సాహసాలు మరియు కీటకాల నుండి గబ్బిలాల దాకా, మొసళ్ళ నుండి కోతుల దాక మరియు ఏనుగుల నుండి ఈల్ చేపల దాకా విచిత్రమైన మరియు అద్బుతమైన జంతువులను చుడండి.


ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా....

కీటకాలు ఎక్కడ నివసిస్తాయి ?
తిమింగలం ఎంత పెద్దగా ఉంటుంది ?
అన్నిటికన్నా అతి పెద్ద పిల్లి ఏది ?


అనేక వాస్తవాలు, దృష్ట్యాoతాలు (ఉదాహరణలు)
మరియు చిత్రాలతో మీరు జంతువుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నవన్ని మీరు లోపల తెలుసుకుంటారు.



ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates