Saturday, May 25, 2013

నాగా రహస్యం




వేట కొనసాగుతోంది. ఒక దుర్మార్గుడైన నాగా తన ప్రాణ మిత్రుడైన బృహస్పతిని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు తన భార్య సతీని వెంటాడుతున్నాడు. చెడుని నిర్మూలించడానికి అవతరించినట్టుగా భవిష్యవాణి చెప్పబడిన టిబెట్ వలసదారు శివ ఎక్కడికక్కడ దుష్ట స్వభావాన్ని ప్రతిఘటించి గానీ నిద్రపోడు. శివ ప్రతీకార పధంలో పయనించే సందర్భంలో సరిగ్గా తను అనుకున్నట్టే నాగా ప్రాంతాన్ని చేరుకుంటాడు.

         మోసం, కపటం లేనిదెక్కడ? అన్నిచోట్లా ఉంది. ఒక అద్బుతమైన ఔషధానికి ప్రతిఫలంగా చెల్లించవలసిన మూల్యం కోసం ఒక రాజ్యం రాజ్యమే అంతమైపోవడానికి సిద్దంగా ఉంది. యువరాజు హతమయ్యాడు. ఆద్యాత్మిక మార్గదర్శకులైన వసుదేవులు చెడుని సహాయంగా తీసుకుంటూ, తమపై తిరుగులేని నమ్మకం కలిగి ఉన్న శివని మోసం చేశారు. మెలుహ రాజ్య పరిపూర్ణత కూడా జనన ప్రాంతమైన మైకాలో దాగిన భయంకరమైన రహస్యాలతో పెద్ద చుక్కుముడిలా తయారైంది. శివకి తెలియకుండా, మహా మేధావి ఎవరో వెనకాల ఉండి, ఈ తోలు బొమ్మలాటకి దర్శకత్వం వహిస్తున్నారు.

         ఈ ప్రయాణంలో శివ ప్రాచీన అఖండ భారతావని అంతా పర్యటించాడు. అడుగడుగునా ప్రాణాంతకమైన మర్మాలు దాగిన ప్రాంతంలో శివ సత్యాన్వేషణ జరుపుతున్నాడు. అన్ని చోట్లా తనకు అర్ధమైన గొప్ప సత్యం ఒకటే.... కనిపించే ప్రతీది అలా మాత్రమే ఉండదు.....! భయంకరమైన యుద్దాలు జరిగాయి. ఆశ్చర్యకరమైన రీతిలో సంధి బలపడింది.
శివ త్రయంలోని మొదటి భాగమైతే ఆ తర్వాత వెలువడుతున్న 
ఈ రెండవ భాగంలో నమ్మలేని రహస్యాలు అనేకం బహిర్గతమవుతాయి.


తెలుగు పుస్తకాల కోసం 
www.logili.com

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates
http://www.facebook.com/logilidotcom

Sunday, April 28, 2013

అష్టవిధ శృంగార నాయికలు






               శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్రేసర రంగస్థల నటులు. ఎంతటి నటులో అంతటి విద్వాంసులు. ప్రాచీన కావ్య పరిజ్ఞానం కలవారు. అంతేకాక ఇప్పుడు ఈ " అష్టవిధ శృంగార నాయికలు" కృతి ద్వారా ఒక ప్రౌడ కవిగా మరోసారి సాహితీ జగత్తులో సాక్షాత్కరిస్తున్నారు.

               అవస్థా భేదాలను బట్టి శృంగార రసంలో అష్టవిధ నాయికలుంటారు. భర్త పరస్త్రీ కాంక్షారహితుడై తనపైనే ప్రగాడమైన అనురాగంతో తనకు అధీనుడై వున్న నాయిక 'స్వాధీన పతిక'. తన ప్రియుడు వచ్చే సమయానికి ఇంటిని, గదిని, తననూ అలంకరించుకొని నిలిచేది 'వాసక సజ్జిక'. విభుడు పరకాంతలోలుడై రాత్రంతా గడిపి, తెల్లవారుజామున తన ఇంటికి రాగా ఈసడించి కసరి కొట్టేది 'ఖండిత'. ఆ తరువాత పశ్చాతాప అయ్యేది 'కలహాంతరిత'. ప్రియుని రాక కోసం ఉత్కంటతో ఉండేది 'విరహోత్కంటిత'. పరదేశాగతుడైన ప్రియుని విరహంలో కృషించేది 'ప్రోషిత భార్త్రుక'. మరి మదనపీడితయై, ప్రియుణ్ణి అన్వేషిస్తూ పోయేది 'అభిసారిక'. సంకేత స్థలానికి వెళ్లి ప్రియుడు కనిపించక ఆర్త అయ్యేది 'విప్రలబ్ద'.

             అభిసారిక ప్రియునికై సంకేత స్థలానికి పోతు పొందే మానసిక మధనాన్ని ఇలా అక్షర రూపంలో మన ముందుంచుతారు శాస్త్రి గారు ....  
             "అతని గన పొంగు వయసుల అణచుతటేట్లు 
              అతని గనకున్న తమి పొంగులడగుటెట్లు 
              చెలునికై చను నా సిగ్గు చితక దింత 
              ఎంత తెంపరినైతి నే నింత తెగువ ?"

                                                                                .... సి నా రె 


ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates