Friday, April 12, 2013

కాలం పంపిన అతిధులు

కాలం పంపిన అతిధులు

చరిత్ర అంటే తనకి ఆసక్తి లేకపోవడం కాదు, చరిత్రకే తనంటే ఇష్టం లేదంటాడు ఆదిల్ . మసీదు దగ్గర ఉన్నట్టుండి ప్రత్యక్షమైన అపరిచితుడు ఆదిల్ సమస్యకి పరిష్కారం చూపిస్తాడా?
.. అనుకోకుండా ఒకరోజు

మత్తయ్య కూలీల కోసం చాలా ఎదురు చూసాడు . చివరికి ఎవరో వచ్చి నారుమళ్ళు కట్టి,నారు పెట్టి వెళ్ళిపోయారు .
ఎవరు  వాళ్ళు ? ఎట్లా వచ్చారు ?
                                                                                                                 ---నారుమడి


ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

                                 

Thursday, April 11, 2013

ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు 


లోగిలి.కాం వారి ఉగాది శుభాకాంక్షలు. పండుగ సందర్భముగా అన్ని పుస్తకాల మీద 10 % డిస్కౌంట్ పొందండి.  ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే.

తెలుగు పుస్తకాల కోసం 


మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు నచ్చిన, మెచ్చిన 
 పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.
please add for new book updates

Wednesday, April 10, 2013

నవ్వుల చిచ్చుబుడ్లు


నవ్వులు దట్టించిన చిచ్చుబుడ్లు 


     నేను దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎంపిక చేసి సంకలించిన జోకుల్లో అత్యధికంగా నవ్వించే జోకులు ఇవి. వీటిలో ఇంగ్లీష్,హిందీ నుంచి అనువదించినవే కాక తెలుగు జోకులు కూడా ఉన్నాయి. కొన్ని జోకులు విన్నవి కూడా వీటిలో ఉన్నాయి.నేను జోకుల్ని మిత్రులు,కుటుంబ సభ్యుల పై ప్రయోగించి, వాళ్ళ నుంచి అట్టహసమైన స్పందన పొందాకనే ఎంపిక చేస్తూ వచ్చాను. వీటిలో మరో విశేషం ఏమిటంటే పిల్లలు,పెద్దలు అందరు ఏ సంకోచం లేకుండా చదివి ఆనందించగలరు. సరైన విధంగా చెప్పగలిగితే చెప్పి అందరినీ నవ్వించగలరు కూడా.
     బాపుగారి తరువాత బాపుగారి వంటి వారు బాలిగారు చిత్రాలు వేసి ఈ నవ్వుల చిచ్చుబుడ్లలో రంగులు నింపారు. 
     నవ్వులు దట్టించిన చిచ్చుబుడ్లు మీ చేతిలో ఉన్నాయి. ఆలస్యం దేనికి, ముట్టించండి ! 
                                                                                               ...... పులిగడ్డ విశ్వనాధరావు 


ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 


తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates


బారిష్టర్ పార్వతీశం


బారిష్టర్ పార్వతీశం



ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే రచన ''బారిష్టర్ పార్వతీశం''. ఇది హాస్య రచన. ఎప్పుడూ దూరప్రయాణం చేసి ఎరుగని పార్వతీశం ఒక్కసారిగా 1913వ సంవత్సరంలో నరసింహ శాస్త్రి ఇంట్లో అమ్మ నాన్నలకు చెప్పకుండా స్నేహితుల ప్రేరణతో ఇంగ్లండ్ వెళ్ళాడు. నిడదవోలులో రైలు ఎక్కడం మొదలుకొని స్టీమర్ లో ఇంగ్లండ్ చేరేవరకు పార్వతీశం చేసిన ప్రయాణాన్ని ఉత్తమ పురుష కధనంలో రకరకాల అనుభవాల్ని రచయత మొక్కపాటి నరసింహ శాస్త్రి ఈ నవలలో చిత్రించాడు.

         ఎప్పుడూ పట్టణాలు,నగరాల మొహం ఎరుగని పార్వతీశం ప్రవర్తన, వేషధారణ హస్యస్పోరకంగా ఉంటాయి.ఇందులో చాల విషయాలు ఇప్పటివారికి చాలా మాములుగా అనిపించవచ్చు. కానీ ఆ కాలంలో అదొక వింత.

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 540
ధర : రూ 333/-


తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates


Monday, April 8, 2013

కధాసరిత్సాగరం

 కధాసరిత్సాగరం
       
                  ముందు కధ పుట్టింది ఈ గడ్డ మీదనే! ఇక్కడనే! భారత దేశం లోనే కధ పుట్టింది. ఇక్కడ పుట్టి పెరిగిన కధనే ప్రపంచ వ్యాప్తంగా అంతా అక్కున చేర్చుకున్నారు . భారత రామాయణాల తర్వాత 'బృహుత్కాధ ' నే ప్రముఖంగా చెప్పుకుంటారు . దీనిని గునాడ్యుడు పైశాచి ప్రాకృత భాషలో రచిస్తే , ' కధకత్రయం ' భుద స్వామి సోమదేవుడు, క్షేమేంద్రుడు దానిని సంస్కృతంలోనికి అనువదించారు. కాశ్మీర ప్రభువు అనంతదేవుని భార్య సూర్యమతి కోసం సోమ దేవుడు ' కధాసరిత్సాగరం ' సృష్టించాడు .

                   ఈ కధల్ని ముందు పార్వతికి శివుడు చెప్పాడు . అతను చెబుతోంటే చాటు నుండి ఈ కధల్ని పార్వతితో పాటుగా శివుని అనుచరులు విన్నారు . విన్న పాపానికి వారంతా భూలోకంలో మానవులుగా జన్మించారు . జన్మించి తాము విన్న కధల్ని అందరికి చెప్పి విముక్తి పొందారు. ఆ నోటా ఈ నోటా కధలన్నీ కదిలి కదిలి ఇప్పుడు మీ ముందుకు ఇలా పుస్తక రూపాన్ని ధరించాయి .

                  ఇందులో ప్రేమ కధలు ఉన్నాయి . వీరుల కధలు ఉన్నాయి. హాస్య-చమత్కారాలు ఉన్నాయి . అధ్బుత కృత్యాలు , భయానక దృశ్యాలు , సాహస కార్యాలు, సముద్ర ప్రయాణాలు , గగన విహారాలు , యంత్రమయ పట్టణాలు , మహ పాపాలు ........ ఎన్నెనో ఉన్నాయి . జంతువులు మాట్లాడుకునే పంచతంత్ర కధలూ, విక్రమర్కునికి బేతాళుడు చెప్పినటువంటి కధలు కూడా ఉన్నాయి . ఒక  మాటలో చెప్పాలంటే ప్రపంచ కధా సాహిత్యం అంతా ఇందులో నిక్షిప్తమై ఉంది .

                 పాటకుల కోరిక మేరకు ఎన్నిక చేసిన ఈ కధలను తెలుగులో సరళ వ్యవహారికంలో అయలసోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధ శర్మ (అనీలజ) నవ్య వీక్లీలో వారం వారం రాసారు . వాటిని పులగుత్తిలా మీ కోసం అందజేస్తున్నాం . అందుకోండి ! చదివి ఆనందించండి !!



రచయిత గురించి 
అయలసోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధ శర్మ (అనీలజ) 13-04-1956 లో జన్మించారు . ప్రవృతి రీత్యా రచయిత, వృతి రీత్యా పత్రికా రచయిత అయిన వీరు సుమారుగా అయిదు వందల కధలూ,అయిదు నవలలూ, అనేక వ్యాసాలు రాసారు . సినిమా, టీవీ రచయితగా కూడా ప్రసిద్దులు . ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ప్రచురణ 'నవ్య వీక్లీ'కి సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు . పిల్లల కోసం వీరు రాసిన పాలపిట్ట (ప్రపంచ ప్రఖ్యాత జానపద కధల  సంకలనం ) కధాసరిత్సాగరం , మహా భారతం పలువురి ప్రశంసలు అందుకున్నాయి .



ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 164
ధర : రూ 130/-


తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

పంచతంత్రం

పంచతంత్రం

విష్ణుశర్మ చెప్పిన పంచతంత్రం కధలు తరతరాలుగా వస్తున్నాయి . పురాణాలూ . ఇతిహాసాల తర్వాత ఇంత ప్రాచుర్యం పొందిన కధలు మరొకటి లేవు . గుణాడ్యుడు రాసిన బృహత్కధలోని కొన్ని కధలే విష్ణుశర్మ పంచతంత్రానికి ఆధారం . ఈ కధల్ని విష్ణుశర్మ అయిదో శతాబ్దంలో రచించాడు . ఇవి మిత్రలాభం . మిత్రభేదం . కాకోలుకీయం, లబ్ధప్రణాశం, అపరీక్షిత కారకం అని అయిదు భాగాలుగా ప్రసిద్ధి చెందాయి .

పంచతంత్రం కధల ఆధారంగా 14 వ శతాబ్దంలో నారాయణ పండితుడు 'హితోపదేశం'రాసాడు . ఈ హితోపదేశం లో మిత్రలాభం , మిత్రభేదం,సంధి , విగ్రహం అని నాలుగు భాగాలు ఉన్నాయి . హితోపదేశం లోని మిత్రలాభం, మిత్ర భేదాలను పరవస్తు చిన్నయ సూరి తెలుగులో అనువదిస్తే, సంధి విగ్రహాలను కందుకూరి వీరేశలింగం అనువదించారు . ఈ నాలుగింటిని కలిపి 'నీతి చంద్రిక ' అని వ్యవహరిస్తున్నారు. అయిదు భాగాలుగా ఉన్న పంచతంత్రం ,అన్న  నాలుగే భాగాలూ ఉన్న హితోపదేశం అన్నా  రెండు  ఒకటే ! అయినా ఈ రెంటిని కలిపి, సమగ్రంగా సరళ వ్యావహారికంలో పాటకుల కోరిక మేరకు అయలసోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధ శర్మ (అనీలజ) నవ్య వీక్లీలో వారం వారం రాసారు . ఆ కదలనే ఇప్పుడే పుస్తకంగా వెలువరిస్తున్నాం .

ఈ కధలు పిల్లలకు చాల ఆసక్తికరంగా ఉంటాయి . కధలలో పాత్రలు జంతువులు కావడం, జంతువులు మనుషుల్లా మాట్లాడుకోవడం, ప్రవర్తించడం పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి . పైగా ప్రతి కధకూ నీతి ఉన్న కారణంగా ఈ కధల్ని పిల్లలు తప్పని సరిగా చదివి తీరాలి . చదివితే మంచి-చెడులు ఇట్టే వారికీ తెలిసి వస్తాయి . పిల్లల కోసం, పెద్దల్లో ఉన్న పిల్లల కోసం సంపూర్ణంగా రూపొందించిన ఈ పంచతంత్రం నేటి తరానికి అపూర్వ కానుక .



రచయిత గురించి
అయలసోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధ శర్మ (అనీలజ) 13-04-1956 లో జన్మించారు . ప్రవృతి రీత్యా రచయిత, వృతి రీత్యా పత్రికా రచయిత అయిన వీరు సుమారుగా అయిదు వందల కధలూ,అయిదు నవలలూ, అనేక వ్యాసాలు రాసారు . సినిమా, టీవీ రచయితగా కూడా ప్రసిద్దులు . ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ప్రచురణ 'నవ్య వీక్లీ'కి సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు . పిల్లల కోసం వీరు రాసిన పాలపిట్ట (ప్రపంచ ప్రఖ్యాత జానపద కధల   సంకలనం ), కధాసరిత్సాగరం , మహా భారతం పలువురి ప్రశంసలు అందుకున్నాయి .


ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates




లౌలి జోక్స్




                                రండి ..... నవ్వుతూ బ్రతుకుదాం ! 
        "సంతోషమే సగం బలం " అన్నారు పెద్దలు. కొందరు ఎప్పుడూ నవ్వుతూ, అందరిని నవ్విస్తూ ఉంటారు. మరికొందరు ఎప్పుడూ సీరియస్ గా వుంటూ ఎందరినో దూరం చేసుకుంటారు. మనకు ఎన్నో కష్టాలుండవచ్చు. సమస్యలుండవచ్చు. ముఖాన్ని సీరియస్ గా ఉంచుకున్నంత మాత్రాన మన భాధలన్నీ మటుమాయమవుతాయా చెప్పండి.

         "నవ్వడం చేతకానివాడు దుకాణం తెరవకూడదు" ఇది చైనా సామెత.

         వికసించిన వదనానదంలో ప్రత్యేకమైన అందముంది. ఆకర్షణ వుంది. నవ్వుతూ పిల్లలతో మాట్లాడితే పరుగున వచ్చి మనల్ని చుట్టేసుకుంటారు. కాస్త చిరాకుగా కనిపించే వాళ్ళకు మాత్రం దూరంగా ఉంటారు పిల్లలు. పిల్లలు నవ్వుతూ,తుళ్ళుతూ,కేరింతలు కొడుతూ వుంటే వాళ్ళను చూస్తూ తల్లిదండ్రులు బాధల్ని మరచిపోతారు.నవ్వుతూ మాట్లాడేవాళ్ళ పట్ల ఇతరులు తొందరగా ఆకర్షించబతారు.

         నవ్వడం మనకు దేవుడిచ్చిన అద్బుత శక్తి. అపూర్వ ఔషధం. ప్రతిక్షణం సంతోషంగా జీవిత పయనం సాగిద్దాం.... విజయం మన స్వంతం.
ఈ పుస్తకం ద్వారా  మీరు ఓ గంటపాటు నవ్వితే మా ప్రయత్నం ఫలించినట్లే. 
నవ్వండి నవ్వించండి 
మీ హృదయాలను పరవశింపచేసే పసందైన జోక్స్ 




తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు నచ్చిన, మెచ్చిన 
 పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates