Wednesday, June 5, 2013

కాశీఖండము


                క్రమముక్తిని కలిగించే మార్గములలో నియమపూరితమైన క్షేత్రవాసమొకటి. క్షేత్రము యొక్క మహాత్త్వాము వలన సాధన త్వరితగతిన ఫలితమీయగలదు. ఉత్తర వాహిని గంగ ప్రవహించే విశ్వనాధుని కాశీ మహాక్షేత్రం, చరిత్ర కందని కాలం నుండి భారతదేశపు ఆద్యాత్మిక రాజధాని-కాశీలో కొలది కాలమైన ఆవాసము చేయవలేనన్నది సగటు భారతీయ ఆస్తికుని ఆకాంక్ష. కాశీలోని ప్రతి అంగుళము మహామహిమోపేతమైన పుణ్యస్థలము.
                   కాశీక్షేత్రమహాత్త్యమును వర్ణించిన పురాణములలో స్కాందము ముఖ్యమైనది. ఇందున్న కాశీఖండము కాశీనగర చరిత్ర, కాశీలోని వివిధ పున్యప్రదేశములను వివరించుచున్నది. క్షేత్రమును దర్శింపదలచినవారు ఆ క్షేత్రపు మహత్త్యము, దర్శనీయ ప్రదేశములు, వాటి చరిత్ర, ఆ క్షేత్రములలో చేయదగిన లేక చేయకూడని పనులు తెలుసుకొనుట అత్యంత ఆవశ్యకము.సంస్కృతాంద్రోపన్యసకులుగా పదవీ విరమణ చేసి దర్మప్రచారంలో ఇతోధికమైన సేవ చేస్తున్న శ్రీ మల్లాది శ్రీహరిశాస్త్రి గారు కాశీవాసులుగా ఉండే తెలుగు వారి కోసం, కాశీ ఖండమును స్వేచ్చానువాదం చేసి దానితోపాటు యాత్రికులకు అవసరమైన యాత్రాదర్శనిని, కాశీక్షేత్రమునకు సంబందించిన ముఖ్య స్తోత్రములను చేర్చి ఒక గ్రంధంగా తీసుకుని రావడం ఎంతో అనందం కలిగించింది. తెలుగు ఆస్తికులకు ఇది ఎంతో ఉపకారము కాగలదు.
                                                                .....శ్రీ కంచికామ పీఠాదిపతులు, శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి 

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates