Sunday, April 28, 2013

అష్టవిధ శృంగార నాయికలు

               శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్రేసర రంగస్థల నటులు. ఎంతటి నటులో అంతటి విద్వాంసులు. ప్రాచీన కావ్య పరిజ్ఞానం కలవారు. అంతేకాక ఇప్పుడు ఈ " అష్టవిధ శృంగార నాయికలు" కృతి ద్వారా ఒక ప్రౌడ కవిగా మరోసారి సాహితీ జగత్తులో సాక్షాత్కరిస్తున్నారు.

               అవస్థా భేదాలను బట్టి శృంగార రసంలో అష్టవిధ నాయికలుంటారు. భర్త పరస్త్రీ కాంక్షారహితుడై తనపైనే ప్రగాడమైన అనురాగంతో తనకు అధీనుడై వున్న నాయిక 'స్వాధీన పతిక'. తన ప్రియుడు వచ్చే సమయానికి ఇంటిని, గదిని, తననూ అలంకరించుకొని నిలిచేది 'వాసక సజ్జిక'. విభుడు పరకాంతలోలుడై రాత్రంతా గడిపి, తెల్లవారుజామున తన ఇంటికి రాగా ఈసడించి కసరి కొట్టేది 'ఖండిత'. ఆ తరువాత పశ్చాతాప అయ్యేది 'కలహాంతరిత'. ప్రియుని రాక కోసం ఉత్కంటతో ఉండేది 'విరహోత్కంటిత'. పరదేశాగతుడైన ప్రియుని విరహంలో కృషించేది 'ప్రోషిత భార్త్రుక'. మరి మదనపీడితయై, ప్రియుణ్ణి అన్వేషిస్తూ పోయేది 'అభిసారిక'. సంకేత స్థలానికి వెళ్లి ప్రియుడు కనిపించక ఆర్త అయ్యేది 'విప్రలబ్ద'.

             అభిసారిక ప్రియునికై సంకేత స్థలానికి పోతు పొందే మానసిక మధనాన్ని ఇలా అక్షర రూపంలో మన ముందుంచుతారు శాస్త్రి గారు ....  
             "అతని గన పొంగు వయసుల అణచుతటేట్లు 
              అతని గనకున్న తమి పొంగులడగుటెట్లు 
              చెలునికై చను నా సిగ్గు చితక దింత 
              ఎంత తెంపరినైతి నే నింత తెగువ ?"

                                                                                .... సి నా రె 

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates

Saturday, April 27, 2013

పాకుడు రాళ్లు

పాకుడు రాళ్లు 

సరిక్రొత్త ప్రచురణ  ఈ రోజే మార్కెట్లో విడుదల

సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రభావంతంగా బొమ్మకట్టించిన తోలి తెలుగు నవల.
        మద్రాసులో ముడున్నరేళ్ళు 'చిత్రసీమ' సినిమా పత్రికలో పనిచేస్తూ సినిమా తారల భేటీలెన్నో దిద్దాను. రిపోర్టర్లతో ఉన్న సాహిత్యంతో వారి ద్వారా తెలుసుకున్న వివరాలు నేను స్వయంగా తెలుసుకున్నవి గుదిగుచ్చి ఒక కధ రాశాను. మంచి స్పందన రావడంతో 'మాయాజలతారు' నవలను రాశాను. దీనికే పాకుడు రాళ్లు పేరు మార్చారు శీలా వీర్రాజు. నాకు ఇష్టమైన నవల ఇది. రాజకీయం,సినిమా మహా సముద్రం లాంటివి. ఎంతరాసిన తక్కువే.
                                                                              ...... రావూరి భరద్వాజ 
                                              
రావూరి భరద్వాజకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం 2013 కు గాను  లభించింది. చిత్ర పరిశ్రమలో వ్యక్తుల అంతరంగాలను అద్భుతంగా అవిష్కరించిన 'పాకుడురాళ్లు 'నవలకు ఈ పురస్కారం దక్కింది. ఈ పురస్కారం వరించిన తెలుగు వారిలో ఆయన మూడో వ్యక్తి. తొలిసారిగా 1970లో విశ్వనాథ సత్యనారాయణ 'రామాయణ మహావృక్షం' రచనకు దక్కిన ఈ పురస్కారం.. తర్వాత 1988లో 'విశ్వంభర' రచనకు గానూ సి.నారాయణరెడ్డిని వరించింది. ఆ తర్వాత సరిగ్గా పాతికేళ్ల అనంతరం జ్ఞాన్ పీఠ్ పురస్కారం మరోసారి తెలుగు రచయిత తలుపు తట్టింది.

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 506
ధర : రూ 290/-

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates

Monday, April 22, 2013

ది పవర్ అఫ్ పాజిటివ్ థింకింగ్

ఇంటర్ నేషనల్ బెస్ట్ సెల్లర్  
                 ప్రపంచ ప్రసిద్ది పొందిన The Power of Positive Thinking పుస్తకమును 'సానుకూల ఆలోచన శక్తి' గా తెలుగులోకి తీసుకువచ్చారు.  
        
         లక్షలాది స్త్రీ పురుషులు వాళ్ళ జీవితాలను విజయవంతం చేసుకోవడానికి సహాయపడింది ది పవర్ అఫ్ పాజిటివ్ థింకింగ్. అనూహ్యమైన అమ్మకాలు సాధించిన ఇందులో డాక్టర్ పీల్ ఆచరణలో విశ్వాసం యొక్క  శక్తిని నిరూపిస్తారు. ఈ పుస్తకంలో వివరించిన ఆచరణీయ కిటుకులతో మీరు మీ జీవితంలో బలం పుంజుకోవచ్చు. పైగా మీ కోరికలను, ఆశలను నేరవేర్చుకోవటానికి అవసరమైన ఉపదేశాన్ని పొందవచ్చు. మీరు నేర్చుకోనేవి :
. మీ మీద ,మీరు చేసే ప్రతిదాని మీద నమ్మకం పెంచుకుంటారు.
. గొప్ప శక్తిని, పట్టుదలని పెంచుకుంటారు.
. మీ లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన శక్తి పెంచుకుంటారు
. చింతపడే లక్షణాన్ని పోగొట్టుకుని విశ్రాంతికరమైన జీవనాన్ని సాధిస్తారు.
. మీ వ్యక్తిగత, వృత్తిపర సంబంధ బాందవ్యాలని మేరుగుపరుచుకుంటారు.
. మీ పరిస్థితుల మీద అధికారం పొందుతారు.
. మీ మీద మీరు దయగా ఉంటారు. 

     పాఠకుడు ఆనందమైన, తృప్తికరమైన,ప్రయోజనకరమైన జీవితాన్ని సాధించడానికి తోడ్పడాలన్న ఏకైక లక్ష్యంతో రాయబడింది ఈ పుస్తకం.

                                                                             ....... నార్మన్ విన్సెంట్ పీల్ 

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates

Thursday, April 18, 2013

పాకుడు రాళ్లు

సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రభావంతంగా బొమ్మకట్టించిన తోలి తెలుగు నవల.
        మద్రాసులో ముడున్నరేళ్ళు 'చిత్రసీమ' సినిమా పత్రికలో పనిచేస్తూ సినిమా తారల భేటీలెన్నో దిద్దాను. రిపోర్టర్లతో ఉన్న సాహిత్యంతో వారి ద్వారా తెలుసుకున్న వివరాలు నేను స్వయంగా తెలుసుకున్నవి గుదిగుచ్చి ఒక కధ రాశాను. మంచి స్పందన రావడంతో 'మాయాజలతారు' నవలను రాశాను. దీనికే పాకుడు రాళ్లు పేరు మార్చారు శీలా వీర్రాజు. నాకు ఇష్టమైన నవల ఇది. రాజకీయం,సినిమా మహా సముద్రం లాంటివి. ఎంతరాసిన తక్కువే.
                                                                                      ...... రావూరి భరద్వాజ 
                                              
రావూరి భరద్వాజకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం 2013 కు గాను  లభించింది. చిత్ర పరిశ్రమలో వ్యక్తుల అంతరంగాలను అద్భుతంగా అవిష్కరించిన 'పాకుడురాళ్లు 'నవలకు ఈ పురస్కారం దక్కింది. ఈ పురస్కారం వరించిన తెలుగు వారిలో ఆయన మూడో వ్యక్తి. తొలిసారిగా 1970లో విశ్వనాథ సత్యనారాయణ 'రామాయణ మహావృక్షం' రచనకు దక్కిన ఈ పురస్కారం.. తర్వాత 1988లో 'విశ్వంభర' రచనకు గానూ సి.నారాయణరెడ్డిని వరించింది. ఆ తర్వాత సరిగ్గా పాతికేళ్ల అనంతరం జ్ఞాన్ పీఠ్ పురస్కారం మరోసారి తెలుగు రచయిత తలుపు తట్టింది.

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates

Wednesday, April 17, 2013

ఆంధ్రప్రదేశ్ అపార్ట్ మెంట్ ( నిర్మాణము,యాజమాన్య హక్కులు ) చట్టము, 1987

         క్రొత్తగా అపార్ట్ మెంట్ల ను కొనుగోలు చేసేవారికి ఈ చట్టం ఎంతగానో ఉపకరిస్తుందనే ఉద్దేశ్యంతో ఈ చట్టాన్ని వ్యాఖ్యాన పూర్వకంగా సరళీకృత తెలుగు భాషలోకి అనువదించడం జరిగింది. అపార్ట్ మెంట్ కొనుగోలుదారులు తమ హక్కులను గురించి తెలుసుకునేందుకు, తమ హక్కులను సంరక్షించుకునేందుకు ఈ పుస్తకం కొంతమేరకైన ఉపకరిస్తుందని మా ఆకాంక్ష.

- భవన యజమానుల (ప్రమోటర్ల) విధులు,బాధ్యతలు 
- ప్రత్యేక సౌకర్యాలు 
- అపార్ట్ మెంట్ పన్ను, భీమా, సౌకర్యాలు 

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates

Tuesday, April 16, 2013

జర్మన్ జానపద కధలు

            ఇవి జర్మన్ జానపద కధలు. పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ఇద్దరు అన్నదమ్ములు సుమారు రెండు వందల కధలను జర్మన్ జానపదాల నుంచి సేకరించారు. వాటిని తమ దేశ బాలలకు అందించారు. జాకబ్ గ్రిమ్, విల్ హెల్మ్ గ్రిమ్ అనే ఈ ఇరువురు సోదరులూ అందించిన కధా సంపదను ప్రపంచంలోని వివిధ దేశాలవారు వివిధ ప్రాంతాలవారు తమ తమ భాషల్లోకి అనువదించుకొన్నారు. సిండ్రెల్లా వంటి కధలు తెలుగులో కూడా వచ్చాయి. ఇదిగో ఇప్పుడు ఆ కధల్లో కొన్నిటిని ఎంపిక చేసి తెలుగు బాలలకు అందిస్తున్నాం. బాలబాలికల మనసులను ఇవి రంజింపచేస్తాయని ఆశిస్తున్నాం. 

ఈ పుస్తకం  కోసం  ఇక్కడ నొక్కండి 

తెలుగు పుస్తకాల కోసం 

మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు   నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com
మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.

please add for new book updates

మేం మళ్ళీ వస్తాం

మేం మళ్ళీ వస్తాం 

               ఇరవైయవ శతాబ్దపు మొదట భాగంలో మహత్తర విజయాలు సాధించిన సోషలిజం, రెండోభాగంలో కుప్పకూలిపోయింది. ప్రపంచంలో మూడవ వంతుగా ఉన్న సోషలిస్ట్ శిబిరం అదృశ్యమై, కాపిటలిజం మాజీ సోషలిస్ట్ దేశాలకు కూడా విస్తరించి నేడు కాపిటలిజానికి ప్రత్యామ్నాయం లేదు అనిపిస్తోంది.

ఒక వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదు అనిపించే పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆ వ్యవస్థ సంపూర్ణ విజయం సాధించినట్లే. ఈ అర్ధంలో కాపిటలిజం,సోషలిజం మీద సంపూర్ణ విజయం సాధించిందని మనం అంగీకరించవచ్చు. మన మనసు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, నేటి వాస్తవ పరిస్థితి ఇది.
కానీ.....
ప్రపంచ వ్యాపితంగా కమ్యునిష్టు ఉద్యమం చిన్నా భిన్నమయిపోయి, ' మార్కిజాన్ని నిలువులోతులో పూడ్చి పెట్టేశాక ' కాపిటిలిజం సురక్షితంగా ఉందా ? లేక 'కమ్యునిస్ట్ భూతం' ఇంకా దాన్ని వెన్నాడుతూనే ఉందా?

సోషలిస్టు శిబిరం ఎందుకు, ఎలా కూలిపోయింది ? ఈ ఘోరపరాజయం తో అంతా ముగిసిందా? లేక వెనక్కు మళ్ళిన విప్లవతరంగం ఈ శతాబ్దంలో మరింత విస్తృతంగా, మరింత ఉదృతంగా మరోసారి విరుచుకు పడబోతోందా ? 

సోషలిస్ట్ శిబిర పతనం తర్వాత 'మార్కిజం మరణించిందా ? లేక సజీవంగా ఉందా?

అసలు మార్కిజం అంటే ఏమిటి ? సోషలిజం అంటే ఏమిటి ?

చదవండి                      చదివించండి             చర్చించండి               
                                                                              .......తాళ్ళపల్లి మురళీధర గౌడ్ 